Akiranandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీని గద్దె దింపి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన అసలు సిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావడానికి కూడా కారకుడయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నిజమైన పవర్ స్టార్ గా నిలిచారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఎన్టీయే సమావేశానికి తనతో పాటు తన భార్య కుమారుడు అకిరానందన్ కలిసి ఢిల్లీ వెళ్లాడు. మీటింగ్ తర్వాత ప్రధాన మంత్రి దగ్గరకు తన కుమారుడు అకిరానందన్ ను  తీసుకెళ్లాడు. అంతేకాదు ప్రధాన మంత్రికి తన కుమారుడు అకిరానందన్ ను  పరిచయం చేసాడు. ఈ సందర్భంగా  ప్రధాని .. అకిరానందన్ ను చూసి సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లో  తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి అంజనా దేవి, అన్న , వదినాల ఆశీర్వాదం తీసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించినందరకు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మొత్తం వేడుకల్లో అందరి కళ్లు అకిరానందన్ పై పడ్డాయి. అంతేకాదు పవర్ స్టార్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎపుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అయితే అకిరానందన్ లాంఛింగ్ బాధ్యతలను రామ్ చరణ్ స్వీకరించినట్టు సమాచారం. ఈ మేరకు బాబాయికి హామి ఇచ్చాడు. ప్రస్తుతం తన సినిమాలు, రాజకీయాలతో పవన్ కళ్యాణ్ మరింత బిజీగా మారనున్నాడు.


ఈ నేపథ్యంలో అకిరానందన్ కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైయిన్ చేయించే బాధ్యతలను తీసుకోబోతున్నాడట. అంతేకాదు అకిరానందన్ లాంఛింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈ విషయమై కొంత మంది రచయతలు ఈ పని మీదే ఉన్నారట.  2026లో అకిరానందన్ హీరోగా గ్రాండ్ లాంఛింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి  నుంచే అభిమానులు కళ్లు కాయలు  కాచేలా ఎదురు చూస్తున్నారు.


Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter