Akkineni Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పాలని డిమాండ్
Akkineni Nagarjuna Reacts Konda Surekha Naga Chaitanya Samantha Divorce Comments: సినీ నటుల జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన కొండా సురేఖఫై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. ఆమెపై అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akkineni Nagarjuna Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో నాగ చైతన్య, సమంత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండిస్తుండగా.. తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కావడంతో సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?
'మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు.. మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నా' అని నాగార్జున ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
Also Read: KTR: హైడ్రాను రేవంత్ కాదు రాహుల్ గాంధీని నడిపిస్తున్నాడు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సర్వత్రా ఆగ్రహం
సినీనటుల వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రత్యర్థులను విమర్శించాలనుకుంటే ఇలా సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం తప్పని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. మహిళా మంత్రిగా ఉన్న ఆమె నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం దారుణంగా పేర్కొంటున్నారు.
న్యాయ పోరాటం
కాగా సురేఖ వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. సురేఖపై పరువు నష్టం దావా వేయాలనే యోచనలో ఉన్నారు. త్వరలోనే ఆమెపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైడ్రా కూల్చివేతలు.. ఆరు గ్యారంటీల అమలు వంటి వాటిని దృష్టి మరల్చేందుకు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.