Nagarjuna: రజనీకాంత్ తో నాగార్జున గొడవ.. ఇదేం ట్విస్ట్ రా బాబు!
Nagarjuna in villain role: ఇప్పటిదాకా హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. హీరోగా కాకపోయినా కొన్ని సినిమాలలో.. క్యామియో పాత్రలలో కూడా ప్రేక్షకులను అలరించారు. కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున.. ఇప్పుడు విలన్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు.
Nagarjuna - Rajinikanth: రజనీకాంత్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై.. కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రజనీకాంత్ కెరియర్లో 171 వ సినిమాగా.. ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్ర టైటిల్ టీజర్ కి.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్.. వింటేజ్ లుక్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో రజనీకాంత్.. ఒక కూలీ పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని.. కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రజనీకాంత్ తో పోటీపడి, ఆయన పాత్రని ఎదురించే పాత్రను చేయడానికి ఎవరైనా స్ట్రాంగ్ నటుడు కావాలంట. ఈ నేపథ్యంలోనే నాగార్జున ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కథతో పాటు తనకి మంచి స్నేహితుడైన రజినీకాంత్.. సినిమా కాబట్టి నాగార్జున కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో.. ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని ఫ్యాన్స్ కి గట్టి నమ్మకం. ఇప్పటి వరకు హీరోగా, మహా అయితే స్పెషల్ రోల్‌లో మాత్రమే నాగార్జున కనిపించారు. మొదటిసారి సూపర్ స్టార్ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారు నాగ్. అంటే ఈ సినిమాలో నాగార్జున రజనీకాంత్ తో గొడవ పడబోతున్నారు అనమాట. అది ఎందుకు, ఏంటి, ఎవరు గెలిచారు అనేది సినిమాలోనే చూడాలి.
ఈ సినిమాలో ఆర్ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో..కనిపించనున్నారు. రజనీకాంత్ మాస్ అవతారంతో కనిపిస్తూనే.. ఎంటర్టైన్ కూడా చేయనున్నారు. మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter