Akkineni Thokkineni By Balakrishna: కావాలని ఫ్లోలో అలా మాట్లాడేస్తారో లేక పొరపాటున పదాలు దొర్లుతాయో? తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ వేదికల మీద అనవసరమైన ప్రసంగాలు చేసి వివాదాల్లో చిక్కుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భాష పరంగా వేదాలు, పురాణాలు ఇలా అన్ని విషయాల్లోనూ మంచి జ్ఞానం ఉన్న బాలకృష్ణ ఎందుకో స్టేజ్ ఎక్కిన తర్వాత మాత్రం వరస తప్పుతూ ఉంటారు. అలా ఏది పడితే మాట్లాడేస్తూ ట్రోలర్లకు, వివాదాలకు చేరువవుతూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు అందరికీ కోపం తెప్పిస్తోంది. పక్కన ఎవరి గురించే చెబుతూ "మా ఆర్టిస్టులు అంత నాకు మంచి TimePass , వేదాలు శాస్త్రాలు నాన్నగారు ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం" అంటూ అంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యాదృచ్ఛికమో దురదృష్టకరమో తెలియదు.



కానీ నందమూరి బాలకృష్ణ అక్కినేని అనే పదం వాడిన రోజే అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో ఈ విషయం అక్కినేని అభిమానులకు మరింత బాధ కలిగిస్తోంది. అయితే వాస్తవంగా నందమూరి బాలకృష్ణ కావాలని అనలేదని మాటల ఫ్లోలో అక్కినేని తొక్కినేని అనే పదం వచ్చి ఉంటుంది తప్ప అది ఎవరినీ ఉద్దేశించి మాట్లాడింది కాదని ఆయన అభిమానులు అంటున్నారు. అంటే ఎప్పుడో ఎస్వీ రంగారావు మొదలు అక్కినేని నాగేశ్వరరావు వంటి వారి గురించి కూడా మా మాటలు మధ్య ప్రస్తావన వస్తుందని నందమూరి బాలకృష్ణ చెప్పాలని అనుకున్నారే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.


అయితే ఇదే విషయం మీద నందమూరి బాలకృష్ణ ఒక క్లారిటీ ఇస్తే తప్ప నిజంగా ఆయన ఎవరిని ఉద్దేశించి మాట అన్నారు, లేక అది పొరపాటున అన్నారా అనేది తెలియదు. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ప్రమోషన్స్ లో పొరపాటున ఒక కులం వారి గురువు రావణాసురుడు అంటూ చేసిన వ్యాఖ్యలు వారిని బాధ పెట్టడంతో వెంటనే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి క్లారిటీ ఏదైనా ఇస్తే తప్ప అక్కినేని అభిమానులు కూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి మరి పరిస్థితి ఎలా మారుతుంది అనేది. 
Also Read: Balakrishna L Word: బాలకృష్ణ నోటి వెంట బూతు పదం... డీజే టిల్లు రియాక్షన్ చూశారా?


Also Read: Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook