Bade Miyan Chote Miyan Trailer Update:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్టీ స్టారర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి. ఒక హీరోని స్క్రీన్ పైన చూస్తేనే అభిమానులు విసిల్స్ వేస్తారు. ఇక ఇద్దరు హీరోలని ఒకేసారి చూస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. అందుకే మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ కూడా ఎంతో క్రేజ్ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ వారి దృష్టి మొత్తం బడే మియా చోటే మియా చిత్రం పైనే ఉంది. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించడం.


టైగర్ ష్రాఫ్,‌ అక్షయ్ కుమార్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ఈ చిత్రం త్వరలోనే యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రానుంది.
ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు ఈ సినిమా గురించి ఒక కీలక అప్డేట్ బయట పెట్టారు సినిమా యూనిట్.


ఈరోజు ఈ చిత్ర యోని ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు. కాక ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో మార్చి 26న రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో ఉండగా వీరిద్దరితో పాటు హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కూడా కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి అని వినికిడి. 


బడే మియా చోటే మియా సినిమాతో ఈ చిత్ర దర్శకుడు ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడమే కాకుండా సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్ తో చిత్రాన్ని సిద్ధం చేశారట. ఇది కేవలం చిత్రం కాదు.. థ్రిల్లింగ్ సీన్స్ తో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది అని తెలిపారు ఈ సినిమా యూనిట్. 


అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చేనెల రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.


Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి