Koffee With Karan: సమంతను ఎత్తుకొచ్చిన అక్షయ్.. మాములు రచ్చ కాదుగా ఇది!
Akshay Carries Samantha in his hands: కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ జరుగుతోంది. ఈ ఏడవ సీజన్ కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్, సమంత రూత్ ప్రభు కలిసి పాల్గొన్నారు.
Akshay Carries Samantha in his hands: కాఫీ విత్ కరణ్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆయన చేసే ఈ షోకి అనేకమంది అభిమానులు ఉన్నారని అనడంలో అతిశయోక్తి లేదు. సినీ సెలబ్రిటీలను తీసుకువచ్చి వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విషయాలను రాబట్టే కార్యక్రమంగా దీనికి మంచి క్రేజ్ ఉంది. తాజాగా కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ జరుగుతోంది.
ఈ సీజన్ డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ ఏడవ సీజన్ కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ మూడవ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్, సమంత రూత్ ప్రభు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ సమంతను తన చేతులతో ఎత్తుకుంటూ షోకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారిపోయింద. సమంత పింక్ అలాగే రెడ్ కలర్ డ్రెస్ లో గ్లామర్ వలకబోయడానికి ప్రయత్నించగా అక్షయ్ కుమార్ బ్లూ కలర్ సూట్ లో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఇక ఈ షోలో భాగంగా తన విడాకుల గురించి సమంతను కరణ్ జోహార్ అడిగిన సమయంలో అన్ హ్యాపీ మ్యారేజస్ అన్నిటికి కారణం నువ్వే అంటూ ఆయన మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేసింది సమంత. ఇక ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ తో కలిసి సమంత డాన్స్ చేయడం కూడా ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ షోలో సమంత తన పెళ్లి, విడాకులకు సంబంధించి పలు విషయాలు పంచుకున్నట్లుగా ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఎపిసోడ్ లో నిజంగా అవన్నీ పంచుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయితే తప్ప ఆ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Mani Ratnam: మణిరత్నంకు కరోనా పాజిటివ్.. ఆ ఈవెంటే అంటించిందా?
Also Read: Srinu Vaitla: ఆ హీరోయిన్ వల్లే విడాకుల దాకా శ్రీను వైట్ల వ్యవహారం?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook