Khel Khel Mein: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27 సార్లు రీమేక్ అయిన అక్షయ్ సినిమా..
Khel Khel Mein: ఒక భాషలో హిట్టైన సినిమాలను వేరే భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ ఆగష్టు 15న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 27 సార్లు రీమేకై ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
Khel Khel Mein: హిందీ చిత్ర పరిశ్రమలోఅక్షయ్ కుమార్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఒక యేడాదిలో దాదాపు 6 నుంచి 7 చిత్రాలు విడుదల చేస్తున్న ఏకైక స్టార్ హీరో అని చెప్పాలి. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందులో రీమేక్ సినిమాల పాత్రలను కొట్టిపారేయలేము. తాజాగా ఈయన హీరోగా ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27 సార్లు రీమేక్ అయింది. ఈ సినిమా ఇటాలియన్ మూవీ ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ కి రీమేక్. ఈ ఇటాలియన్ మూవీ ఇప్పటి వరకు 26 సార్లు రీమేక్ అయింది. తాజాగా హిందీతో కలిపి 27 వ సారి రీమేక్ అయింది. 2016లో విడుదలైన ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ ఇటాలియన్ మూవీకి ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ రీమేక్ . ఈ సినిమా ఇప్పటి వరకు అత్యధిక సార్లు రీమేక్ అయిన చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
2023 వరకు 24 సార్లు రీమేక్ అయింది. ‘నథింగ్ టూ హైడ్ అంటూ ఫ్రెంచ్ భాషలో రీమేక్ అయింది. కిల్ మొబైల్ అంటూ చైనా భాష మాండరిన్ లో రీమేక్ అయింది. రష్యాలో ‘లౌడ్ కనెక్షన్’ పేరుతో రీమేడ్ అయింది. అటు జర్మన్, రొమేనియన్, హిబ్రూ, అరబిక్ భాషల్లో ఈ సినిమాను ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’పేరుతోనే రీమేక్ చేయడం విశేషం.
అటు మన దేశంలో కన్నడలో ‘లౌడ్ స్పీకర్’పేరుతో అఫీషియల్ గా రీమేక్ చేశారు. మలయాళంలో ‘12th మ్యాన్’గా రీమేక్ అయింది. తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులతో ‘రిచి గాడి పెళ్లి’ పేరుతో రీమేక్ చేశారు. ప్రపంచంలో పలు భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో మాత్రం రీమేక్ చేయబడలేదు. ఇంగ్లీష్ లో ఈ సినిమా రీమేక్ కాకపోవడం వెనక పెద్ద రీజనే ఉంది. 2017లో ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్న సంస్థ దివాళ తీయడంతో ఈ సినిమా ఆగిపోయింది. త్వరలో ఇంగ్లీష్ లో ఈ సినిమా రీమేక్ కానునట్టు సమాచారం.
తాజాగా ఈ చిత్రాన్ని 2024లో హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాతో రీమేక్ అయింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. తాప్సి, ఫర్దీన్ ఖాన్, ప్రగ్యాజైస్వాల్, ఆదిత్య సీల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే..
ఏడుగురు ఫ్రెండ్స్.. కలిసి డిన్నర్ వెళతారు. మాటల సందర్భాల్లో అక్కడ ఉన్న ఓ అమ్మాయి.. భార్య, భర్తల మధ్య ఉన్న ఫోన్ లో మెసెజ్ లు ఒకరిదొకరు చూస్తే వారు విడిపోతారని చెబుతుంది. దీనిపై వాళ్లలో చర్చ మొదలవుతుంది. ఈ సందర్బంగా ఓ గేమ్ ఆడతారు. ఈ సందర్భంగా గ్రూపు సభ్యులందరి ఫోన్ లోని మెసెజ్ లు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ రౌండ్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో ఒకరి ఫోన్ లో ఎలాంటి మెసెజ్ లు వచ్చాయి. దాన్ని అవతలి వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించిదనేది తెరపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 2016లో విడుదలైన ఇటాలియన్ సినిమా దాదాపు 32 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. మరి ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter