Sunil Shroff passes away: బాలీవుడ్ నటుడు సునీల్‌ ష్రాఫ్‌(Sunil Shroff ) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన ఎప్పుడు చనిపోయారు, మరణానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు. రీసెంట్ గా అక్షయ్ కుమార్ మరియు పంకజ్ త్రిపాఠి నటించిన ప్రముఖ చిత్రం 'ఓ మై గాడ్ 2'లో సునీల్‌ ష్రాఫ్‌ నటించారు. అలాగే రిలీజ్  కు రెడీగా ఉన్న  'షిద్దత్'లో కూడా సునీల్ మంచి పాత్రే చేశాడు. ఆయన మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంతాపం ప్రకటించింది. అతను ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇతడు 2021లో కబాద్ - ది కాయిన్ అనే చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేశాడు. సునీల్ మూవీస్ లోనే కాకుండా వెబ్ సిరీస్ లోనూ నటించాడు. ఇతడు జూలీ, జఘన్య వంటి చిన్న వెబ్ సిరీస్‌లలో కూడా పనిచేశారు. అంతేకాకుండా కునాల్ ఖేము నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ అభయ్‌లో సునీల్ డాక్టర్ పాత్రను పోషించారు. 2019లో అర్జున్ రాంపాల్ లీడ్ రోల్ లో నటించిన ది ఫైనల్ కాల్‌లో సునీల్ కనిపించాడు. ఇతను కొన్ని యాడ్ ఫిల్మ్స్  కూడా చేశాడు.


చక్‌ దే ఇండియా నటుడు కన్నుమూత
ఇటీవల బాలీవుడ్ నటుడు రియో ​​కపాడియా (66) కన్నుమూశారు. సెప్టెంబరు 14న అతడు తుదిశ్వాస విడిచాడు. ఇతడు చక్ దే ఇండియా, దిల్ చాహ్తా హై, హ్యాపీ న్యూ ఇయర్’  మరియు మర్దానీ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడికి  భార్య మరియా ఫరా, పిల్లలు అమన్ మరియు వీర్ ఉన్నారు. రియో మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 


Also Read: Jawan Movie: 700 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్.. తొమ్మిదో రోజు ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook