Nayanthara Surrogcay : ఈ ఏడాదిలో పెళ్లై, తల్లైన హీరోయిన్లు వీరే.. సహజగర్భంతో వాళ్లు, సరోగసితో నయన్
Nayanthara Blessed Twins in 2022 నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సరోగసి ఇండియాలో నిషేదంలో ఉండటం, దాంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే.
Nayanthara Blessed Twins in 2022 ఈ ఏడాదిలో హీరోయిన్ల విషయంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. కొందరు పెళ్లైన మూడు నాలుగు నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇంకొంత మంది తారలు గత ఏడాది వివాహాం చేసుకున్నారు. ఈ ఏడాది తల్లి అయ్యారు. మరి కొంత మంది హీరోయిన్లు ఈ ఏడాది వివాహాం చేసుకున్నారు. మొత్తానికి హీరోయిన్లు మాత్రం ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కోసం కూడా తాపత్రయ పడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇందులో అలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరికీ ఈ ఏడాది ఏప్రిల్ పెళ్లిలో అయింది. అయితే నవంబర్‌లో పండంటి బిడ్డ పుట్టేసింది. దీంతో పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అని అందరికీ అర్థమైంది. అందుకే హడావిడిగా పెళ్లి కానిచ్చేశారని బీ టౌన్‌లో టాక్ వినిపించింది.
ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి, ఆ తరువాత జరిగిన కాంట్రవర్సీ, సరోగసి ద్వారా కవల పిల్లల్ని కనడం, ఆ తరువాత ప్రభుత్వం ఆ కేసును విచారించడం, అందులో విస్తుపోయే విషయాలు బయటకు రావడం అందరికీ తెలిసిందే. నయన్ విఘ్నేశ్‌లు ఐదారేళ్ల క్రితమే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారని, ఈసరోగసి చట్ట బద్దమేనని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. అలా నయన్ పెళ్లి జూన్‌లో జరగ్గా.. అక్టోబర్‌లో కవలల పిల్లలను కనేసింది.
ఇక గత ఏడాది పెళ్లిళ్లు చేసుకున్న కాజల్, ప్రణీత ఫ్యామిలీల్లో ఈ ఏడాది సంతోషం రెట్టింపు అయింది. కాజల్ అగర్వాల్‌కు అక్టోబర్ 30 2020న వివాహాం జరగ్గా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను తల్లి అయినట్టుగా కాజల్ ప్రకటించుకుంది. ఇక ప్రణీతకు గత ఏడాది మేలో పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది జూన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందులో ప్రణీత, కాజల్, అలియా ఇలా అందరూ కూడా సహజగర్భంతోనే బిడ్డలను కన్నారు. వీరు కాకుండా ఈ ఏడాది పెళ్లి చేసుకున్న భామల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. కత్రినా విక్క కౌశల్, హన్సిక, మౌనీ రాయ్, రీచా చద్దా వంటి వారి పెళ్లి కూడా ఈ ఏడాదిలోనే జరిగింది.
Also Read : చిరంజీవిని కోరిన చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల.. అదేంటో తెలుసా?
Also Read : 18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ ప్రేజీ ప్రేమతో నిండింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook