Alia Bhatt: బాలీవుడ్ లేడీ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఫిల్మ్ లో భాగంగా ‘ఆల్ఫా’ మూవీకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఆలియా భట్ జాయిన్ అయింది. లేడీ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ఆలియా భట్.. సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్  అందని రీతిలో ఈమె పాత్ర ఉండబోతుందని సమాచారం. తాజాగా ఆలియా షూటింగ్ స్పాట్ లో ఎంటరైనపుడు క్లిక్ అనిపించిన లుక్కే తాజాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను అత్యంత సీక్రెట్ గా తెరకెక్కించనున్నట్టు మేకర్స్ తెలియజేసారు. అంతేకాదు షూటింగ్ జరిగే స్పాట్ లో మొబైల్ ఫోన్ లను అనుమతించేది లేదంటూ పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యశ్ రాజ్ ఫిల్మ్స్ లో మొదటి ఫీమేల్ లీడ్ లో తెరకెక్కుతోన్న స్పై యూనివర్స్ గా తెరకెక్కుతోంది ఆల్ఫా. ఇందులో ఆలియా సూపర్ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది. శివ రవైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన ‘ది రైల్వే మెన్’  డైరెక్ట్ చేసిన ఇతనికి ఫస్ట్ సినిమా ఇది. ‘ది రైల్వే మెన్’ సినిమాలో భోపాల్ గ్యాస్ ట్రాజెడీని అద్భుతంగా తెరకెక్కించిన ఈ టేకింగ్ కు అందరు ఫిదా కావాల్సిందే.


యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ‘ఏక్ థా టైగర్’, టైగర్ జిందా హై’, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో ‘వార్ 2’ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఈ కోవలో ‘ఆల్ఫా’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.


Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి