Alia Bhatt Time Magazine:  అమెరికాకు చెందిన ఫేమస్ మ్యాగజైన్ టైమ్స్ ప్రతి యేడాది గ్లోబల్ లెవల్లో ఫేమసైనా 100 మందితో కూడిన జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది.  2024 యేడాదికాను అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో  బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌కు స్థానం కల్పించారు.  ప్రపంచ వ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావవంతమైన  వ్యక్తుల జాబితాలో ఆలియా భట్ చోటు దక్కడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయింది. అంతేకాదు 2021 యేడాదికి కాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. ఇందులో మన దేశం తరుపున ఆలియా భట్ కాకుండా..  మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, వరల్ల్ బ్యాంక్ అధ్యక్షుడైన భారతీయ మూలాలున్న వ్యక్తి అజయ్ బంగా..  డైరెక్టర్ దేవ్ పటేల్‌కు ఇందులో చోటు కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు అమెరికాకు చెందిన ఫ్యూయల్ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా, యేల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యాజమాని అస్మా ఖాన్, రష్యా అపోజిషన్ లీడర్ అలెక్సీ నావాల్నీ బార్య యులియా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా ఫైనాన్స్ మినిష్టర్ జానెట్ యెలెన్ అజయ్ బంగా ప్రొఫెల్ రాశారు. అత్యంత ప్రభావవంతమైన సంస్థను లీడ్ చేయడం అంటే మాములు విషయం కాదు.. అందుకు నైపుణ్యంతో పాటు ఉత్సుకత ఉన్న లీడర్‌ను సెలెక్ట్ చేయడం మాములు విషయేమి కాదు. గత జూన్‌ నెలలో అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్ధిక స్థితిగతులను మార్చడంలో కీ రోల్ పోషించాయి. మైక్రోసాఫ్ట్ అధినేతగా సత్య నాదెళ్ల చేస్తోన్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.


Also read: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు