Alia Bhatt Sister Pooja Bhatt Telugu Movie: అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలియాభట్ కంటే ముందు ఆమె సోదరి పూజ భట్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి అలియా భట్, పూజా భట్ ఇద్దరూ ఒక తండ్రికి జన్మించారు, అయితే  ఇద్దరి తల్లులు వేరు. అందుకే పూజ భట్ కి, అలియా భట్ కి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ఫిబ్రవరి 1972వ సంవత్సరంలో మహేష్ భట్- కిరణ్ భట్ దంపతులకు జన్మించిన పూజ తన తండ్రి తెరకెక్కించిన డాడీ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకునేందుకు ఆమె అనేక వివాదాస్పద సినిమాల్లో కూడా నటించింది. అలాగే స్టార్ డస్ట్ లాంటి బోల్ ఫోటోషూట్స్ లో కూడా కనిపించింది. సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, రిషి కపూర్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి వాళ్ళతో కూడా ఆమె నటించింది. ఆమె కేవలం నటనకు మాత్రమే పరిచయం పరిమితం కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా అనేక సినిమాలకు పనిచేసింది. చివరిగా ఆమె 2019లో ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా ప్రస్తుతం జిస్మ్ 3 అనే సినిమాకి ఆమె నిర్మాతగా, డైరెక్టర్గా వ్యవహరిస్తోంది.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె తెలుగులో బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కేఎస్ రామారావు నిర్మించగా కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో శ్రీహరి, తనికెళ్ల భరణి, నాజర్, మురళీ మోహన్, సుధ కూడా నటించారు. అయితే ఈ సినిమా ఒక అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆమె తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. గత ఏడాది ఆమె తన ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకోవడమే కాక పండంటి బిడ్డకు సైతం జన్మనిచ్చింది. 
Also Read: Veera Simha Reddy OTT: వాల్తేరు వీరయ్య కంటే ముందే ఓటీటీలోకి వీర సింహా రెడ్డి.. ఎప్పుడంటే?


Also Read:  Pathaan 1000 Crore Club: వెయ్యి కోట్ల క్లబ్లో జాయినయిన పఠాన్.. ఇండియన్ హిస్టరీలో ఐదవ సినిమా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook