Mokshagna: బిగ్ బ్రేకింగ్.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Nandamuri Mokshagna Debut Film With Prasanth Varma: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఫిక్సయ్యింది. హీరోగా తొలి సినిమానే పెద్ద దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Nandamuri Mokshagna Entry: నందమూరి వంశం నుంచి మరో వారసుడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. నట సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Also Read: Tamanna Bhatia: పుస్తకాల్లో హీరోయిన్ జీవితం.. అందాలు ఆరబోసే తమన్నా మా పిల్లలకు ఆదర్శమా?
నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం హీరో మోక్షజ్ఞ. తన సినిమా ఎంట్రీ గురించి మోక్షజ్ఞ 'ఎక్స్'లో పంచుకున్నాడు. మొదట 'వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి' ఒక పోస్టు చేశాడు. అనంతరం మరో రెండు ట్వీట్లు చేశాడు. 'ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్ వర్మతో' అని ఒక ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో 'ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్‌బీకే 109, ఎన్టీఆర్ దేవర, మోక్షు అరంగేట్రం. నందమూరి నామ సంవత్సరం' అంటూ అభివర్ణించాడు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. నందమూరి వంశం నుంచి ఎంతో మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. ఆ వంశం నుంచి వస్తున్న మూడో తరం మోక్షజ్ఞ. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోగా కూడా మోక్షు ప్రత్యేకత సాధిస్తున్నాడు. బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మోక్షజ్ఞ శరీరాకృతి హీరోకు తగ్గట్టు లేదు. హీరోకు తగ్గట్టు మోక్షజ్ఞ రూపురేఖలు మార్చుకున్నాడు. గతంలో కంటే చాలా సన్నగా.. ఆకర్షణీయంగా మోక్షజ్ఞ తయారయ్యాడు.
గతంలో చాలా సార్లు రాజకీయ, సినీ కార్యక్రమాల్లో మోక్షజ్ఞ కనిపించాడు. చిన్నప్పుడు హ్యాండ్సమ్.. మ్యాన్లీ లుక్‌లో కనిపించిన మోక్షు తర్వాత బొద్దుగా మారాడు. నారా లోకేశ్ యువగళంలో కొంచెం సన్నమై కనిపించిన మోక్షజ్ఞ తర్వాత కనిపించలేదు. లావు తగ్గడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర కసరత్తులు చేసి మోక్షజ్ఞ తగ్గినట్లు సమాచారం. మోక్షు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు స్వాగతిస్తున్నారు. మరో నట సింహంగా మోక్షజ్ఞ కనిపిస్తాడని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter