Allari Naresh Ugram Movie Teaser నాంది సినిమాతో డైరెక్టర్‌గా విజయ్ కనకమేడలకు, హీరోగా నరేష్‌ కొత్త ఇమేజ్ వచ్చింది. అయితే ఈ ఇద్దరూ మళ్లీ ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ వచ్చింది. ఇందులో నరేష్ తన కొత్త అవతరాన్ని చూపించాడు. ఎంతో ఇంటెన్స్ ఉన్న యాక్షన్ రోల్‌ను చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ ఉగ్రరూపంతో కనిపించాడు. ఇక టీజర్ చివర్లో బూతు డైలాగ్‌తో ఆశ్చర్యపరిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మూవీ టీజర్ చూస్తుంటే మాత్రం ఇదొక రివేంజ్ డ్రామాలా కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ విలన్లను ఎదురించడం.. విలన్లేమో హీరో ఫ్యామిలీని టచ్ చేయడం.. భార్యనో పాపనో చంపడం.. ఆ తరువాత హీరో మళ్లీ పగ తీర్చుకోవడం అనే కాన్సెప్టుతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి సీరియస్ రోల్, ఇంటెన్స్ యాక్షన్ చేయడం మాత్రం నరేష్‌కు కొత్త. అలా అతడ్ని చూడటం మనకూ కొత్తే.


అందుకే ఈ ఉగ్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే విజయ్ కనకమేడల మాత్రం టీజర్‌ను ఇలా కట్ చేయడంలోనూ స్ట్రాటజీ మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అసలు కథను రివీల్ చేయకుండా ఇలా టీజర్‌ను కట్ చేసినట్టుగా అనిపిస్తోంది. నరేష్ మాత్రం ఇప్పుడు ఫుల్లుగా సీరియస్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.


 



ఆల్రెడీ గత ఏడాది ఇట్లు మారెడుమిల్లీ నియోజకవర్గం అంటూ వచ్చాడు. అందులోనూ నరేష్‌ సీరియస్ రోల్‌లోనే కనిపించాడు. ఇకపై గతంలోలా కామెడీ సినిమాలు, పేరడి సినిమాల్లో నరేష్ ఇక కనిపించకపోవచ్చు. విజయ్ కనకమేడలకు ద్వితీయ విఘ్నం ఉంటుందా? లేదా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? అన్నది చూడాలి.


Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్


Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook