Allu Arjun Arrest News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారని చెబుతున్నారు.


అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా.. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ మామ, అల్లు శిరీష, అల్లు అరవింద్ స్టేషన్‌లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ తరుఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అరెస్ట్‌ను ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.