Allu Arjun - Atlee: అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ' ది రైజ్ ఫస్ట్ పార్ట్‌తో సూపర్ హిట్  అందుకోవడమే కాదు.. ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం. అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. ఇక అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ.  ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.


 తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. 


Also Read: KCR Speech: టీవీ ముందు కూర్చుంటా.. రేవంత్‌ రెడ్డి తాట తీస్తా: కేసీఆర్‌ సంచలన ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి