Allu Arjun Birthday-'Where is Pushpa': అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా సుకుమార్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. పుష్ప ది రూల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ రెండో పార్ట్ ఎలా ఉంటుంది.. కథను ఎలా ముందుకు తీసుకెళ్తారు.. అసలు పుష్పని ఎలా చూపించబోతోన్నారనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు వేర్ ఈజ్ పుష్ప అనే వీడియోను వదిలారు. కాసేపటి క్రితం విడుదల చేసిన ఈ చిన్నపాటి టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇందులో బన్నీకి సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్ న భూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉంది. మొదటి పార్ట్‌లో చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు సరైన సీన్ పడింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వెళ్లాయంటే.. పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వెళ్లిందంటే.. పుష్ప వచ్చాడని అర్థమంటూ చెప్పించిన డైలాగ్‌కు అదిరిపోయే సీన్‌ను సుకుమార్ డిజైన్ చేశాడు.


పుష్పను పోలీసులు కాల్చేశారని, ఎనిమిది బుల్లెట్లు దిగాయని, పోలీసులు నెల రోజులు వెతికినా దొరక్కపోవడంతో పుష్ప మరణించాడని అంతా అనుకుంటూ ఉండటం, పుష్ప చేసే మంచి పనుల వల్ల జనాలంతా కూడా అతడ్ని దేవుడిలా చూస్తుంటారని ఇందులో చూపించేశాడు. ఇక పుష్ప బతికే ఉన్నాడా? లేదా? అనే అనుమానంతో జనాలు ఉండగా.. పులుల జాడ కనుక్కునేందుకు పెట్టిన నైట్ విజన్ కెమెరాల్లో పుష్పని చూపించడం, పుష్పను చూసిన తరువాత పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేసినట్టు చూపించడంతో వేర్ ఈజ్ పుష్ప వీడియో అదిరిపోయిందంతే.


Also Read:  Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా



పుష్ప గాడి రూలు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌.. మ్యానరిజం మరోసారి హైలెట్ కాబోతోంది. ఇక పుష్ప దెబ్బకు ఈ సారి రికార్డులు బద్దలు అయ్యేలానే ఉన్నాయి. సుకుమార్ ఇందులో చూపించిన విజువల్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అయితే బన్నీని తప్పా మిగిలిన ఏ ఇంపార్టెంట్ కారెక్టర్‌ని కూడా ఇందులో చూపించలేదు. శెకావత్, శ్రీవల్లి, కేశవ ఇలా ఏ కారెక్టర్‌ను కూడా చూపించలేదు. బన్నీ బర్త్ డేకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చేశాడు సుకుమార్.


Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook