Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
Allu Arjun Silence on Naatu Naatu అల్లు అర్జున్ ఒక్కడే ఇంకా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సంతోషంగా ఉందని, ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని స్పందించలేదు. టాలీవుడ్ బడా హీరోలంతా కూడా ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఆనందంగా ఉందని మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా అందరూ కూడా స్పందించారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.
బన్నీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నాడు. నేషనల్ పార్కులు అంటూ తిరుగుతున్నాడు. పులులు, సింహాల మధ్య ఫ్యామిలీతో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ ఇంత వరకు ఆస్కార్ అవార్డు గెలవడం పట్ల తన సంతోషాన్ని గానీ ఆనందాన్ని గానీ బయటకు పంచుకోలేదు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ చెప్పినట్టుగా ఒక్క ట్వీట్ గానీ పోస్ట్ గానీ కనిపించడం లేదు.
దీంతో బన్నీ వ్యవహారం మీద అంతా గుర్రుగా ఉన్నారు. కావాలనే ఇలా చేస్తున్నాడా? లేదంటే తన పుష్ప సినిమాకు రాలేదని రగిలిపోతోన్నాడా? పుష్ప సెకండ్ పార్ట్‌తో అయినా ఆస్కార్ వరకు వెళ్లాలని అనుకుంటున్నాడా? ఇలా అనేక రకాలుగా బన్నీ మీద చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి.
అల్లు అర్జున్ ఇలా సైలెంట్‌గా ఉండటం, ఆస్కార్ వచ్చినా కూడా ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ కూడా చెప్పకపోవడంతో ఆయన పద్దతిపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం పూట కూడా బాలీవుడ్ నుంచి ఒక్క ట్వీట్ కూడా పడలేదు. కానీ మధ్యాహ్నం నుంచి బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం స్పందించారు. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి వారు ట్వీట్లేసి ఆర్ఆర్ఆర్ టీంను అభినందించారు. మరి మన బన్నీ ఎప్పుడు స్పందిస్తాడు? అసలు స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
అయితే కాసేపటి క్రితమే బన్నీ స్పందించాడు. ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా అభినందించాడు. గ్లోబల్ స్టార్స్ అంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను ప్రస్థావించాడు. నా బ్రదర్ అంటూ రామ్ చరణ్‌ను తెలుగు ప్రైడ్ అంటూ ఎన్టీఆర్‌ను మెన్షన్ చేశాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. తెలుగు ప్రైడ్ అని ఎన్టీఆర్ సంబోధించడంపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook