Ala Vaikunthapurramuloo Hindi Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు ఇనాళ్ల వరకు యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేసిన హిందీ ప్రేక్షకులు.. 'పుష్ప' సినిమాతో తొలిసారి థియేటర్లలో బన్నీ మానియాను ఆస్వాదించారు. డిసెంబరు 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇటు తెలుగుతో పాటు.. అటు హిందీ వర్షెన్ లోనూ కలెక్షన్లు కొల్లగొట్టింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం పుష్ప నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, థియేటర్లలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనూ పుష్ప సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దీంతో హిందీ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను ఈ చిత్రం కొల్లగొట్టింది. విదేశాల్లోనూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోందీ చిత్రం. 


'పుష్ప' సూపర్ హిట్ తో మంచి ఊపుమీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు మరో సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.



2020 జనవరిలో 'అల వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్, టాలీవుడ్​లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీ వెర్షన్​నే ఈ జనవరి 26న నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.


ఈ సినిమాలో 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలు ఎంత సెన్షేషన్​ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్​లో ఆ పాటలకు వచ్చిన వ్యూస్, సోషల్ మీడియాలో వాటికి ఉన్న క్రేజ్ దీనికి ఉదాహరణ.


అయితే 'అల వైకుంఠపురములో' సినిమాను ప్రస్తుతం హిందీలోనూ 'షెహజాదే' పేరుతో రీమేక్​ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఒరిజినల్​ వెర్షన్ ఇప్పుడు​ రిలీజ్ అయిపోతే, దీని పరిస్థితి ఏంటనేది తెలియాలి. 


Also Read: Janhvi Kapoor Swimsuit: వీకెండ్ వైబ్స్.. స్విమ్‌ సూట్‌లో జాన్వీ కపూర్ అందాల విందు!!


Also Read: Lata Mangeshker Health Update: లతా మంగేష్కర్‌ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook