Allu arjun press meet on Sandhya theatre stampede: పుష్ప2 మూవీ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. తను ఎంతో ఒత్తిడిగా ఉన్నానన్నారు. ఇది అనుకోకుండా.. జరిగిన ఘటన అని క్లారిటీ ఇచ్చారు.రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయంను ఎవరు పూడ్చలేనిదన్నారు. పుష్ప2 మూవీలో .. మరేంటైనా.. సినిమా కోసం వచ్చిన వాళ్లు నవ్వుతూ వెళ్లాలని అనుకొనే వాడినన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా శ్రీతేజ్ తొందరగా కోలుకొవాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు అన్నివిధాలుగా సహాకరించిందన్నారు. 20, 30 ఏళ్లుగా అదే థియేటర్ కు వెళ్లానన్నారు. కొందరి వ్యాఖ్యలు తనకు బాధకల్గించాయన్నారు.


కేవలం కారులో ఉన్నప్పుడు.. అభిమానులకు ప్రేమతో అభివాదం చేశారన్నారు.  ఆరోజు రోడ్ షో చేయలేదన్నారు. సినిమా పెద్ద హీట్ అయిన కూడా పదిహేను రోజుల నుంచి ఎంతో బాధతో ఉన్నామన్నారు. కేసు ఫైల్ చేయడం వల్ల.. తమ లీగల్ టీమ్ సలహా మేరకు..వెళ్లి కల్వకూడదన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏదైన జరిగితే గతంలో కలిసిన విషయాలను గుర్తు చేశారు. 


కానీ ఎప్పటికప్పుడు.. తన వారితో బాధిత యువకుడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటునే ఉన్నానన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం లీగల్ కారణాల వల్లనే శ్రీతేజ్ ను పరామర్శించలేకపోయానన్నారు. ఆ కుటుంబానికి మాత్రం.. తాము అండగా ఉంటామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.


Read more: Komati Reddy: గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటి రెడ్డి.. రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధికసాయం..


ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సినిమాకు రావడం.. పోలీసులు చెప్పిన కూడా వెళ్లక పోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. పోలీసులు వెళ్లమన్నా.. కారులో కూర్చుని మరల లేచీ.. ఓపెన్ టాప్ వెహికిల్ లో కూర్చుని రోడ్ షో నిర్వహించారన్నారు. అందుకే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter