Pushpa 2: పుష్ప 2 జాతర సీన్ వల్ల అడ్డంగా బుక్కైన అల్లు అర్జున్..!
Pushpa 2 Allu Arjun: అల్లు అర్జున్ నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి సంధ్య థియేటర్ ఘటన గురించి చెప్పడంతో.. ఆరోజు ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ అబద్ధాలు చెబుతున్నారని కొంతమంది ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.
Pushpa 2 Viral Post: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నా.. ఈ ఆనందం ఎక్కువ రోజులు మిగిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు.. ఈ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నది. మరోవైపు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వగా.. అల్లు అర్జున్ ను అరెస్టు చేసి ఒకరోజు జైల్లో ఉంచారు చంచల్గూడా జైలు అధికారులు. అయితే ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ని చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పలకరించడం జరిగింది.
ఈ విషయం మీద ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి సంచలనం సృష్టించాయి
ముఖ్యంగా అల్లు అర్జున్ ను స్టార్ సెలబ్రిటీలు కలవడంపై ఘాటుగానే స్పందించారు.. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ నిన్నటి రోజున రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు విషయాల పైన మాట్లాడారు. అయితే ఇక్కడ మాత్రం ఎవరి పేరు చెప్పలేదు. ఇది కేవలం అనుకోకుండా జరిగిందని, ఇందులో ఎవరి తప్పు లేదని పరోక్షంగానే చెప్పేశారు.
కానీ కొంతమంది మాత్రం తన మీద ఆరోపణలు చేస్తూ తన క్యారెక్టర్ ని దిగజారుస్తున్నారని తెలిపారు. తనకు పోలీసులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, తమ మేనేజ్మెంట్ చెప్పడం వల్లే తాను థియేటర్లో నుంచి వెళ్ళిపోయాను అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. అలాగే థియేటర్ కి వెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు వచ్చి చెప్పడంతో తాను థియేటర్లో నుంచి బయటికి వెళ్లిపోయాను అంటూ చెప్పరు. అయితే ఈ విషయం పైన చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చిన వెంటనే స్క్రీన్ పై.. సినిమా స్టార్ట్ అవ్వగానే తనకు ఈ విషయం తెలియడంతో అక్కడి నుండి వెళ్లిపోయానని చెప్పాడు..కానీ ఇంటర్వెల్ తరువాత.. దాదాపు క్లైమాక్స్ దగ్గర జాతర సన్నివేశం చూసి సంతోషంగా ఫీల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు కూడా. అయితే అభిమానులు మాత్రం మహిళ మరణించారనే విషయాన్ని ఆయనకు పోలీసులు చెప్పలేదని కౌంటర్ వేస్తూ ఉన్నారు.అంతేకాదు తమ అభిమాన హీరో పైన కక్షపూరితంగానే ఇలా చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ డిజిపి జితేందర్ పలు విషయాలను వెల్లడించారు..
ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని, అల్లు అర్జున్ కి తాము వ్యతిరేకం కాదని, చట్టపరంగా కూడా ఆయన పైన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా పౌరుల భద్రత రక్షణ ముఖ్యమని తెలిపారు.. ఆయన సినీ హీరో కావచ్చు కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను సైతం అర్థం చేసుకోవాలి.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ప్రజలకు మంచిది కాదు అని, ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యమేమి కాదు అంటూ తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. అలాగే జర్నలిస్టు పైన దాడి చేసిన మోహన్ బాబు పైన కేసును నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని.. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని డిజిపి జితేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.