Allu Arjun - Pushpa 2 Big Update: అల్లు అర్జున్ ఎన్న‌డు లేన‌ట్టుగా త‌న కెరీర్‌లో ఫుల్  ఫామ్‌లో ఉన్నాడు. 2021 యేడాది సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌  పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలోని న‌ట‌న‌తో తొలిసారి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు. ఇపుడీ ఈ సినిమాకు రెండో భాగం పుష్ప 2 మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను ఆగ‌ష్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ‌తేడాది పుష్ప 2 మూవీ నుంచి ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడీ రెండో భాగంలో డాన్ గా మారి.. ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు దేవుడిగా మారిన పుష్పను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తారు. ఇందులో భాగంగా అడ‌విలో పారిపోవ‌డం.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే పుష్ప 2 మూవీ స్టోరీ. ఈ నెల 8న అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా  పుష్ప 2 నుంచి స‌ర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంద‌న చెబుతున్నారు. అంతేకాదు రేప‌టి నుంచి ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు. అందులో క్యారెక్ట‌ర్స్ ను ప‌రిచ‌యం చేస్తారా.. ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ ఇస్తారా అనేది చూడాలి.

ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్.. అట్లీ, త్రివిక్ర‌మ్‌ల‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయన్నాడు. వాటితో పాటు బోయ‌పాటి శ్రీ‌ను, సందీప్ రెడ్డి వంగాలు లైన్లో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కు సంబంధించిన మైన‌పు విగ్ర‌హాన్ని దుబాయ్‌లో ఉన్న‌మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ త‌న మైన‌పు విగ్ర‌హాన్ని స్వ‌యంగా ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే క‌దా.


Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి