Pushpa The Rule: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొని ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో కూడా మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న మొన్నటిదాకా డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా కథను ఒకే భాగంలో చెప్పలేక సినిమాని రెండు భాగాలుగా విడుదల చేశారని పుష్ప: ది రూల్తో సినిమా కథ పూర్తవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాకి మరొక సీక్వెల్ కూడా ఉండబోతుందట. పుష్ప రాజ్ కథ నెరేట్ చేస్తూ పుష్ప 3 కూడా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక పుష్ప 2 సినిమా క్లైమాక్స్లో కూడా పుష్ప 3 కి సంబంధించిన ఒక హింట్ ఉంటుందని అది కచ్చితంగా సినిమాకి హైలైట్ అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ ప్రకటించడం, ఆ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్లను క్రియేట్ చేయటం ఒక ట్రెండ్గా మారిపోయింది. ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన కార్తికేయ 2 సినిమాకి కూడా మరొక సీక్వెల్ ఉంది అని దర్శకనిర్మాతలు హింట్ ఇచ్చారు. ఆఖరికి కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా క్లైమాక్స్ లో కూడా కేజీఎఫ్: చాప్టర్ 3 కి సంబంధించిన హింట్ ఉంది.


అదే విధంగా ట్రెండ్ని ఫాలో అవుతూ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు తన పుష్ప 2 సినిమా క్లైమాక్స్లో కూడా పుష్ప 3 సినిమాకి సంబంధించి ఒక హింట్ ఉంటుందని కొందరు చెబుతున్నారు. పుష్ప 2 సినిమా మొత్తం పుష్పరాజ్, మలయాళం స్టార్ ఫాహద్ ఫాసిల్ నటించిన భన్వర్సింగ్ శికావత్ పాత్రల చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. మరి ఒకవేళ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే పుష్ప 3 సినిమాలో ఎవరు ముఖ్య విలన్ కాబోతున్నారని కూడా తెలియాల్సి ఉంది.


సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది.


ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం


ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..