Pushpa 2: యూట్యూబ్ లో పుష్ప సంచలనం... ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్!
Pushpa 2 Record : పుష్ప రెండోభాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మొన్న ఈ మధ్య విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది..
Pushpa 2 Update: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. 2021లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమాకి రెండో భాగం ప్రకటించడంతో.. అప్పటినుంచి ఈ సినిమా సెకండ్ పార్ట్ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు భాషలోనే కాకుండా హిందీ అలానే మిగతా సౌత్ బాషలో కూడా పుష్ప సినిమా మంచి విజయం సాధించటంతో.. ప్రస్తుతం అన్ని భాషల వారు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక ఊర మాస్ టీజర్ విడుదల చేశారు సినిమా యూనిట్. పుష్ప సినిమా కథ తిరుపతి ప్రాంతం చుట్టూ తిరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి తిరుపతిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగమ్మ జాతర నేపథ్యంలో ఈ టీజర్ ని తెరకెక్కించారు. ఈ గంగమ్మ జాతరలో పుష్ప చీర కట్టుకొని ఊర మాస్ ఫైట్ చేస్తూ టీజర్ లో కనిపించడంతో.. ఆ టీజర్ కాస్త అందరిని తెగ ఆకట్టుకుంది.
ఈక్రమంలోనే ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువ ఉండటంతో..ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఏకంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కావడంతో ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూడాలని ఆసక్తి చూపించారు.
దీంతో నిన్న ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్.. 24 గంటల్లో ఏకంగా 85 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు 1.2 మిలియన్స్ కి పైగా లైక్స్ ని కూడా అందుకొని యూట్యూబ్ ట్రేండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది.
కాగా ఈ చిత్రానికి వల్ల క్రేజ్ కి ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. మరో విశేషమేమిటి అంటే కేవలం నైజం హక్కులను సొంతం చేసుకోవడం కోసమే 100 కోట్ల వరకు పోటీ వెళ్లిందని తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: Revanth Reddy Flight: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...
Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter