Where Is Pushpa Youtube Records అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రూల్‌ సినిమా ఆకాశన్నంటేలా క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే బన్నీ బర్త్ డే సందర్భంగా సుకుమార్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. బన్నీని ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించాడు. ఇక వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన వీడియో సైతం అందరినీ ఆకట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాకు సౌత్ కంటే నార్త్‌లోనే ఎక్కువ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. కేవలం డబ్బింగ్ సినిమా వచ్చి.. వంద కోట్లు కొల్లగొట్టేసింది. హిందీ బెల్టులో వంద కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. బన్నీ ఆ ఫీట్‌ను అందుకున్నాడు. డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. దీంతో రెండో పార్ట్‌ని సైతం నార్త్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూనే తీయబోతోన్నారు.


 



అందుకోసం ఈ రెండో పార్టులో ఇంకా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన వీడియో నార్త్‌లో బాగానే ఎక్కేసింది. ఈ వీడియోకు హిందీలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దాదాపు డెబ్బై మిలియన్ల వ్యూస్ నార్త్ నుంచే వచ్చాయి. మిగిలిన ముప్పై మిలియన్ల వ్యూస్‌లో తెలుగు నుంచి వాటా అధికంగా ఉంది.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


పుష్ప సినిమాకు నార్త్‌లో మంచి క్రేజ్ ఉండటం.. ఇప్పుడు వేర్ ఈజ్ పుష్ప వీడియోకి కూడా నార్త్లో క్రేజ్ రావడంతో సుకుమార్, బన్నీ ప్లాన్ సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రెండో పార్ట్‌కు నార్త్‌లో ఎంత క్రేజ్, డిమాండ్ ఉన్న విషయం అర్థమైంది. బన్నీ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రమోషన్ ఈవెంట్లకు దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. నాలుగు కోట్లు పెట్టిన దానికి సరైన ఫలితమే వచ్చినట్టు అనిపిస్తోంది. వంద మిలియన్ల వ్యూస్, మూడు మిలియన్ల లైకులతో పుష్ప గాడి రూలుని చూపించేస్తున్నారు.


Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook