Rift between mega family and Allu Arjun family: మెగా ఫ్యామిలీ (Mega Family) రెండుగా చీలి పోయిందా?.. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌ (Allu Arjun)కు విభేదాలొచ్చాయా?.. నందమూరి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దగ్గరైందా? అనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన పరిస్థితులే అభిమానుల్లో ఈ అనుమానాలకు తావిచ్చాయి. గతంలో మెగా ఫ్యామిలీ యువ హీరోలు అల్లు అర్జున్‌, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్‌ తేజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అతిథిలుగా వెళ్లారు. ఆపై అల్లు అర్జున్‌ సినిమా వేడుకలకు మెగా హీరోలు.. మెగా హీరోల మూవీ ఫంక్షన్స్‌కు స్టైలిష్ స్టార్ వెళ్లలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీజే, సరైనోడు వంటి సినిమా ఈవెంట్లలో పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్‌ చేత 'పవర్‌స్టార్‌' అని పిలవాలని పట్టుబట్టారు. వేదికపై అల్లు అర్జున్‌ మాట్లాడుతున్నంత సేపు అరుస్తూ ఉండటంతో.. డీజే, సరైనోడు ఫంక్షన్‌లో 'చెప్పను బ్రదర్‌' అంటూ కామెంట్‌ చేశారు. ఇది పవన్‌ అభిమానులను బాగా హర్ట్ చేసింది. దీంతో స్టైలిష్ స్టార్ సినిమాపై నెగటివ్‌ కామెంట్లు చేస్తూ వచ్చారు. అప్పుడే మెగా ఫ్యామిలీకి బన్నీ దూరమయ్యాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక అల వైకుంఠపురములో సమయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో.. చిరంజీవికి నేను పెద్ద అభిమానిని, ఈ జీవితకాలం ఆయన అభిమానినే అని అల్లు అర్జున్‌ చెప్పారు. ఆపై అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీతో ఎక్కువగా కనిపించకపోవడంతో రూమర్లు కొనసాగాయి. 


Alo Read: Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?!!


ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీకి సంభందించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో బాలయ్య బాబు ఫాన్స్ ' జై బాలయ్య' అనాలంటూ బన్నీని కోరారు. దీంతో బన్నీ 'జై బాలయ్య' అని అన్నారు. దీంతో మెగా అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అంతేకాకుండా ఆహాలో కొత్త టాక్‌ షో ప్రారంభించాలనుకున్నప్పుడు బాలకృష్ణతో చేస్తే ఎలా ఉంటుందనే అల్లు అరవింద్‌ ఆలోచన కూడా ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో అల్లు రామలింగయ్య, అల్లువారి ఫ్యామిలీతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్‌, అల్లు రామలింగయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. 


ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ఫంక్షన్స్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. అంతేకాకుండా రిలీజ్‌కు ముందు నుంచే మెగా ఫ్యామిలీ అభిమానులు పుష్ప మూవీని టార్గెట్ చేశారు. సినిమా బాగోలేదంటూ ప్రచారం చేశారు. దాంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ నిజంగానే దూరమయ్యాడనే వార్తలు మరోసారి వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలకు ఒకే ఒక్క ఫోటోతో అల్లు అర్జున్ చెక్ పెట్టారు. మేమంతా ఎప్పుడూ ఒక్కటే అని స్పష్టం చేసారు. 


Also Read: Sunny Leone: వివాదంలో సన్నీలియోన్ సాంగ్...నిషేధించాలంటున్న పూజారులు..


క్రిస్మస్‌ పండగ సందర్భంగా అల్లు అర్జున్‌ (Allu Arjun) మెగా హీరో (Mega Hero's)లకు పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి అల్లు అర్జున్‌ నివాసంలో జరిగిన వేడుకలకు రామ్‌ చరణ (Ram Charan), ఉపాసన, నిహారిక, చైతన్య, వరుణ్‌ తేజ్‌ (Varun Tej), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), వైష్ణవ్‌ తేజ్‌తో పాటు చిరంజీవి కుమార్తెలు సుస్మితా, శ్రీజ హాజరయ్యారు. వేడుకల అనంతరం ఫ్యామిలీ మొత్తం ఫొటోలకు పోజులిచ్చారు. ఫ్యామిలీ పోటోలను వరుణ్‌ తేజ్, బన్నీ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఫొటోలు చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు (AlluFamily), మెగా ఫ్యామిలీ  (Mega Family) మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook