Tollywood: తెలుగు సినీ పరిశ్రమ ఏపీకు తరలిపోనుందా, రెండుగా చీలుతుందా, ఏం జరగనుంది
Tollywood: పుష్ప 2 వివాదం నేపధ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ రేగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలనుందా లేక ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుందా అనే వాదన మొదలైంది. అసలేమైంది, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Tollywood: పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య ధియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం కొత్త పరిణామాలకు దారితీస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచేది లేదని తెలంగాణ ముఖ్మమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో తెలుగు సినీ ప్రముఖులకు ఆందోళన కలుగుతోంది.
సంధ్య ధియేటర్‌లో తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ నేపధ్యంలో రేగిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెట్టి వెంకట్ రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా సినీ పరిశ్రమపై వరుసగా విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ఘటనను సాకుగా చేసుకుని ఇకపై ప్రీమియర్ షో, బెనిఫిట్ షో, టికెట్ల పెంపు ఉండదని ప్రకటించేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని కుండబద్దలు గొట్టేశారు. అల్లు అర్జున్ వివాదం నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏపీకు తరలిపోతుందనే కొత్త వాదన బయటికొచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడిన కొన్నేళ్లకు హైదరాబాద్‌కు తరలివచ్చింది. అప్పటి నుంచి క్రమంగా హైదరాబాద్ అన్ని విధాల సౌకర్యాలతో తెలుగు సినీ పరిశ్రమకు కేరాఫ్‌గా నిలిచింది. ఆ తరువాత ఏపీ, తెలంగాణలుగా విభజన తరువాత కూడా హైదరాబాద్‌లోనే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు తెలుగు సినీ పెద్దలు. అయితే ఏపీలో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో సినిమా టికెట్ట తగ్గింపు వ్యవహారంతో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకు రావాలనే వాదన తొలిసారిగా వచ్చింది. విశాఖకు సినీ పరిశ్రమ తరలివస్తే అన్ని సౌకర్యాలు, అవసరమైన ఇంటి స్థలాలు, రాయితీలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని లేవనెత్తి సినీ పరిశ్రమను ఏపీకు ఆహ్వానించారు.
తాజాగా అల్లు అర్జున్ వివాదం, తెలంగాణ ప్రభుత్వ వైఖరితో మరోసారి ఈ వాదన బలంగా విన్పిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ ఏపీకు తరలివెళ్తుందా లేదా అనే చర్చ మొదలైంది. ఒకవేళ అలా కాకపోయినా రెండుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో గట్టి కదలికనే తెచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపైనే తెలుగు సినీ ప్రముఖుల్లో గట్టి చర్చ నడుస్తోంది.
ఏపీలో ఆ పరిస్థితులున్నాయా
ఏపీకు తెలుగు సినీ పరిశ్రమ తరలుతుందా లేదా అనేది పక్కనబెడితే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. తెలంగాణతో పోలిస్తే సినిమా షూటింగులకు ఏపీ నిస్సందేహంగా అనుకూలమైంది. ప్రకృతి సహజసిద్ధ అందాలతో ఉంటుంది. కానీ మౌలిక సదుపాయాలు మాత్రం అంతగా లేవు. రాత్రికి రాత్రి ఏపీలో అవి కల్పించే పరిస్థితి లేదు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు సంబంధించిన పనులకు కావల్సిన వ్యవస్థ ఏపీలో ఇంకా లేదు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్డూడియోస్, పద్మాలయా స్డూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, రామకృష్ణ స్డూడియోస్, రామానాయుడు స్డూడియోస్ అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
Also read: Bank Holidays: జనవరి బ్యాంకు సెలవుల జాబితా, 14 రోజులు మూతపడనున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.