Allu Arjun Son: టాలీవుడ్‌లో అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత అల్లు రామలింగయ్య నట వారసుడిగా అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈయన నటుడిగా కంటే నిర్మాత సక్సెస్ అయ్యారు. ఇక అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. మిగతా ఇద్దరిలో ఒకరు నిర్మాతగా.. మరోకరు హీరోగా పరిచయమైనా.. పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అంతేకాదు మెగా ఫ్యామిలీ ట్యాగ్ కాకుండా అల్లు ఫ్యామిలీగా తన కంటూ ప్రత్యేక ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు బన్ని. తాజాగా అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ త్వరలో వెండితెరపై తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించింది. ఇపుడు కూతురు బాటలోనే కుమారుడు పుష్ప 2 మూవీలో ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అయాన్ పై కొన్ని సీన్స్‌ను టెస్ట్ షూట్ చేసి సుకుమార్ ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణను పరిచయం చేసిన సుకుమార్.. ఇపుడు పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ కుమారుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే తరువాయి.  


అల్లు అర్జున్ విషయానికొస్తే..  అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. అంతేకాదు ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. అటు సుకుమార్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అటు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగాలతో పాటు, సురేందర్ రెడ్డితో రేసుగుర్రం 2 మూవీలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.


Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌


Also Read: Delhi Liquor Scam: 'నాకు చాలా అనుమానాలున్నాయి.. విచారణకు రాలేను': సీబీఐకి కవిత లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి