Allu Arjun Dhaba: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో అనూహ్యంగా ప్రచారానికి వెళ్లిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంచలనం సృష్టించారు. తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా ప్రచారానికి వెళ్లడంతో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తన బాబాయి పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేయకుండా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రచారం చేయడం కలకలం సృష్టించింది. ఇంకా అర్జున్‌ రగిల్చిన వేడి చల్లారలేదు. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా బన్నీ అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపించాడు. అంతే సామాన్యంగా ఒక చిన్న హోటల్‌లో అల్లు అర్జున్‌ భోజనం చేశాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాల్‌ వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దు: జానీ మాస్టర్‌


 


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల సీటు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు అంటే మే 11వ తేదీన అల్లు అర్జున్‌ అనూహ్యంగా నంద్యాలలో పర్యటించాడు. తన చిరకాల స్నేహితుడు శిల్పా రవికు మద్దతుగా ప్రచారం చేసేందుకు నంద్యాలకు వెళ్లాడు. తన భార్య స్నేహాతో కలిసి వెళ్లాడు. అయితే ప్రచారానికి వెళ్లి తిరిగివచ్చే క్రమంలో అర్జున్‌ తన నిరాడంబరత చాటుకున్నాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబాలో భోజనం చేశాడు.

Also Read: Kovai Sarala: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుంటా: బ్రహ్మానందం హీరోయిన్‌


 


హైదరాబాద్‌ తిరిగి వస్తున్న క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలో ఆగారు. ఆ దాబా పేరు గురునానక్‌ దాబా అని సమాచారం. అక్కడ అల్లు అర్జున్‌, స్నేహా ఇద్దరూ భోజనం చేశారు. దాబా నిర్వాహకులు వారికి ప్రత్యేకంగా వండి వడ్డించారు. ప్రచారానికి వెళ్లి తీవ్ర ఆకలి మీద ఉండడంతో వడ్డించిన ఆవురావురమంటూ తినేశారంట. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చెబుతున్నారు. పంజాబ్‌ దాబా కావడంతో అక్కడి రుచులను టేస్ట్‌ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అర్జున్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. స్నేహా తింటున్న ఫొటో కనిపించింది. ఈ ఫొటోను చూసి బన్నీ అభిమానులు విస్తృతంగా ఫార్వార్డ్‌, కామెంట్లు, రీట్వీట్లు చేస్తున్నారు.


ఇక సినిమాల విషయానికి వస్తే అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప 2' చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన  టీజర్‌, పాటలు ప్రేక్షకుల్లో భారీ స్పందన లభించింది. పుష్ప తర్వాత తన అభిమాన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయనున్నాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter