Pushpa 2 The Rule OTT Rights: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఒకవైపు పుష్పతో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు కార్పోరేట్ కంపెనీలు బన్నితో యాడ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఈయన మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో హీరోగా నిలిచాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న పుష్ప 2 షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరగుతోంది. ఈ సినిమాపై తెలుగు సహా సౌత్‌తో పాటు నార్త్‌లో భారీ  డిమాండ్ ఏర్పడింది. తాజాగా పుష్ప 2 ఐదు భాషలకు చెందిన ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. మొత్తంగా రూ. 200 కోట్లకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా నార్త్ హక్కులు దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఒక రకంగా బాలీవుడ్ హీరోలకు కూడా ఈ రేంజ్ మార్కెట్ కావడం లేదు. అది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టీజర్ విడుదలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ నట  విశ్వరూపం  చూపించబోతున్నాడు. రష్మిక మందన్న మరోసారి తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్, సుకుమర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప పార్ట్ 1' మూవీతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ పురస్కారం అందుకున్న ఫస్ట్  హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి.  



అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టాడు. పుష్ప2 తర్వాత  త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు.  అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.  


అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.


Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ సంచలనం.. పిఠాపురంలో మావయ్య పవన్‌ కల్యాణ్‌కు మద్దతు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter