Allu Arjun: రిపబ్లిక్ మూవీకి, సాయి ధరమ్ తేజ్‌కి అల్లు అర్జున్ సపోర్ట్
Republic movie gets boosting from Allu Arjun: దురదృష్టవశాత్తుగా తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్‌కి అందుబాటులో లేడని తన ట్వీట్‌లో పేర్కొన్న అల్లు అర్జున్.. అభిమానులు, ఆడియెన్స్ రిపబ్లిక్ మూవీని (Republic movie review) చూసి ఆదరించాల్సిందిగా తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశాడు.
Republic movie gets boosting from Allu Arjun: సాయిధరమ్ తేజ్ హీరోగా విడుదలైన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సినిమాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సపోర్ట్ లభించింది. సాయి ధరమ్ తేజ్ ఇటీవలే బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కి అందుబాటులో లేడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ గాయాల బారి నుంచి కోలుకునేందుకు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్‌కి అండగా నిలవాల్సిన అవసరం ఉందని భావించిన అల్లు అర్జున్.. రిపబ్లిక్ మూవీని ఆదరించాల్సిందిగా కోరుతు శుక్రవారం ఓ ట్వీట్ చేశాడు.
దురదృష్టవశాత్తుగా తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్‌కి అందుబాటులో లేడని తన ట్వీట్‌లో పేర్కొన్న అల్లు అర్జున్.. అభిమానులు, ఆడియెన్స్ రిపబ్లిక్ మూవీని (Republic movie review) చూసి ఆదరించాల్సిందిగా తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశాడు.
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej's Republic movie trailer), రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవ కట్ట, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణన్ సహా మూవీ యూనిట్ సభ్యులు అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విటర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశాడు.
Also read : Gandhi Jayanti 2021: గాంధీ జయంతి సందర్భంగా చూడాల్సిన టాప్ 5 చిత్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook