Allu Arjun New Movie: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సినిమా తీయనున్నారా? అంటే అవునే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల చోటు చేసుకున్న పరిణామం ఇందుకు మరింత ఊతమిస్తోంది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్​లో బిజీగా ఉన్న మరో కొత్త ప్రాజెక్ట్​పై దృష్టిసారించినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఏం జరింగిందంటే..


అల్లు అర్జున్ ఇటీవల ముంబయికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్​ స్టార్ డైరెక్టర్​ సంజయ్​ లీలా భన్సాలిని కలిసేందుకు ఆయన ఆఫీస్​కు వెళ్లారు. అల్లు అర్జున్ సంజయ్​ లీలా భన్సాలీ ఆఫిస్​కు వెళ్లిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అయితే సినిమా వాళ్లు అన్నాక ఒకరినొకరు కలుసుకోవడం సాధారణంగా జరిగేదే. అయితే ఏ ఈవెంట్​ సమయాల్లోనో లేదా వేరే ప్రత్యేక సమయాల్లోనో అయితే అది సాధారణంగా జరిగింది అనుకోవ్చు. కానీ అల్లు అర్జున్​ ఒక్కసారిగా సంజయ్ లీలా భన్సాలీని కలవడం సినీ ప్రేమికుల్లో అంచనాలు పెంచేస్తోంది.


గత ఏడాది 'పుష్ప ది రైజ్​' సినిమాతో హిట్​ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ఆ సినిమాకు కొనసాగింపు అయిన 'పుష్ప ది రూల్​' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రెగ్యులర్ షూటింగ్స్ ఈ ఏడాదే పూర్తయ్యే అవకాశముంది. అయితే దీనితో అల్లు అర్జున్​ తర్వాతి మూవీ ఏది అనేది ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.


ఇదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'గంగూ భాయ్​ కతియావాడి' మూవీ ఇటీవల విడుదలైంది. ఆయన తర్వాతి సినిమాపై కూడా ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.


దీనితో ప్రస్తుతం సంజయ్​ లీలా భన్సాలీ, అల్లు అర్జున్​ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరువురు కాంబోలో తదుపరి సినిమా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.


Also read: Rashmika Mandanna: యువ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. సూపర్ కాంబో!!


Also read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook