Pushpa 2 Shooting Muhurat Date: అల్లు అర్జున్ క్రేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకుపోయిన సినిమా పుష్ప మూవీ. అవును.. ఒక్క టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే కాకుండా సౌతిండియన్ సినీ పరిశ్రమలోనూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి నటుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి అల్లు అర్జున్ క్రేజును ఇంకెక్కడికో తీసుకెళ్లింది పుష్ప మూవీ. అల్లు అర్జున్ రఫ్ లుక్ గెటప్, ఇంతకు ముందెప్పుడూ చూడని ప్రత్యేకమైన మ్యానరిజం, ఆడియెన్స్‌ని ఉర్రూతలూగించే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అన్నింటికి మించి సుకుమార్ డైరెక్షన్.. ఇలా ఎన్నో అంశాలు పుష్ప 2 మూవీని ఆడియెన్స్ సొంతం చేసుకునేలా చేశాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2 మూవీపై పార్ట్ 1 మించిన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ ఒక తిరుగులేని స్మగ్లర్‌గా ఎదగడం చూసిన అభిమానులు.. పుష్ప సీక్వెల్లో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రజెన్స్ ఇంకెంత భారీగా ఉంటుందోనని లెక్కలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ అక్టోబర్ రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త ప్రస్తుతం స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయ్యింది. 


సెప్టెంబర్ 12 లేదా 15వ తేదీ నుంచే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతాడని గతంలో వార్తలొచ్చినప్పటికీ.. అది నిజం కాకపోవడంతో అవి గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. ఇక తాజాగా అక్టోబర్ మధ్యలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ లాంచ్ అయిన కొద్ది రోజులకే పుష్ప 2పై హైప్ పెంచేలా అల్లు అర్జున్ లుక్ రివీల్ చేస్తూ పోస్టర్స్, ప్రోమోలు రిలీజ్ చేసే ప్లాన్‌లో సుకుమార్ ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. అదే కానీ జరిగితే.. అంతకంటే ఎక్కువ తమకు ఇంకేం కావాలంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. 


Also Read : Manchu Vishnu Trolling : 85% ట్రోలింగ్ ఆ నటుడి ఇంటి నుంచే.. మంచు విష్ణు సంచలనం!


Also Read : Jabardasth Comedian Murthy: జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి.. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోనే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి