Allu Arjun No.1 : సౌత్ లో దుమ్మురేపిన అల్లు అర్జున్.. అందరినీ వెనక్కు నెట్టి ముందుకు
Allu Arjun No.1 in South industry: అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఆసియా వ్యాప్తంగా ప్రజలు బాగా గూగుల్ చేసిన మొదటి 100 మంది పేర్లను గూగుల్ సంస్థ విడుదల చేయగా ఈ జాబితాలో అల్లు అర్జున్ సౌత్ హీరోలలో మొదటి స్థానం సంపాదించాడు.
Allu Arjun No.1 in South industry: హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ వారసుడిగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన మొదటి సినిమా గంగోత్రితోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సినిమా, సినిమాకి మెరుగవుతూ స్టైలిష్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఐకాన్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్నారు.
గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బన్నీ భారత దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించగా, ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఆసియా వ్యాప్తంగా ప్రజలు బాగా గూగుల్ చేసిన మొదటి 100 మంది పేర్లను గూగుల్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ సౌత్ హీరోలలో మొదటి స్థానం సంపాదించాడు. అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్, సూర్య, మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి నటులు ఉన్నారు.
అయితే ఈ 100 మంది జాబితాలో అల్లు అర్జున్ కి 39 వ స్థానం లభించగా కాజల్ అగర్వాల్, రష్మిక మందన వంటి వారు ఆయన కంటే ముందే ఉన్నారు. అలాగే ఈ జాబితాలో అనుష్క శెట్టి, సాయిపల్లవి వంటి ఇతర హీరోయిన్లకు కూడా స్థానం లభించింది.అయితే అల్లు అర్జున్ సౌత్ హీరోలందరిలో టాప్ గా నిలవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పుష్ప సినిమాతోనే ఇంత అద్భుతమైన క్రేజ్ సాధించాడంటే మరింతమంది టాప్ డైరెక్టర్లలో పనిచేస్తే ఆయన క్రేజ్ ఖండాంతరాలు దాటడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కాల్సిన పుష్ప ది రూల్ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. వీలైనంత త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని మరింత మార్కెట్ జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏ మేరకు మార్కెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:Ambika Rao no more : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నటుడి మరణం మరువక ముందే అంబికా మృతి!
Also Read: Movies Releasing this week: పక్కా కమర్షియల్ మొదలు ఈ వారం ఓటీటీ-థియేటర్లలో వచ్చే సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.