Allu Arjun: హార్ట్ టచ్చింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న పోస్ట్
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun-Pawan Kalyan: ఎన్నికలకు ముందు వరకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ల..మధ్య జరిగిన కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. సొంత మావయ్య అయినా పవన్ కళ్యాణ్ కు.. కేవలం సోషల్ మీడియా ద్వారా తన మద్దతును ప్రకటించిన అల్లు అర్జున్.. తన స్నేహితుడు వైసిపి అభ్యర్థి శిల్పా రవి కోసం.. నంద్యాల వెళ్లి మరి తన మద్దతును ప్రకటించారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే హర్ట్ అయ్యారు. నాగబాబు కూడా అల్లు అర్జున్ గురించి ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో.. ట్వీట్లు చేసి తర్వాత డిలీట్ చేశారు. నిన్న మొన్నటి దాకా.. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతూనే ఉంది.
తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ఒక ట్వీట్ వల్ల.. ఈ గొడవలుకి శుభం కార్డు పడేలాగా కనిపిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నీ నియోజకవర్గాల్లో గెలిచి అఖండ విషయాన్ని సాధించారు.
ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఇంట.. సెలబ్రేషన్లు మొదలైపోయాయి. అభిమానులతో పాటు పలు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా జనసేనని పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా.. పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
"ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా ప్రజలకు సేవ చేయాలి అన్న మీ కమిట్మెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ప్రజలకు సేవ చేసే దిశగా మీ కొత్త జర్నీ కి నా శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్.
తాజాగా బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ ఆగుతుందో లేదో చూడాలి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ను గేమ్ చేంజర్ అని, మాన్ అఫ్ ది మ్యాచ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే అన్నగా గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు చిరు.”డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను,” అంటూ ట్విట్ చేశారు మెగాస్టార్.
Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter