Allu Arjun Visits KIMS: భాగ్య నగరంలో  కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను  కాసేటి క్రితమే అల్లు అర్జున్ పరామర్శించారు. అంతేకాదు అతని బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వెంట వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత అతని తండ్రికి కలిసి భరోసార ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ రాక నేపథ్యంలో అభిమానులు ఎవరు అక్కడ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా పోలీసులు అనుమతితో దాదాపు 34 రోజుల తర్వాత అల్లు అర్జున్ శ్రీతేజ్ ను హాస్పిటల్ లో పరామర్శించారు. గతంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హాస్పిటల్ కు వచ్చి బాలుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీతేజ్ కు అయ్యే ఆరోగ్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని హామి ఇచ్చింది. ఈ ఘటనలో నేపథ్యంలో శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలు కలిసి రూ. 2 కోట్ల పరిహారానినిక సంబంధించిన చెక్ ను శ్రీతేజ్ తండ్రికి అందజేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా రికార్డుల జాతర మోగిస్తోంది. ముఖ్యంగా హిందీలోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా 32 రోజుల్లో బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ .. రూ. 1810 కోట్లను క్రాస్ చేసి రూ. 1832 కోట్ల గ్రాస్ వసూళ్లతో మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా పుష్ప 2 ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.  అంతేకాదు హిందీలో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో పుష్ప 3 ఉండనే ఉంది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.