Allu Arjun vs NTR: అల్లు అర్జున్ కి.. ఎన్టీఆర్ కి ఉన్న తేడా అదే.. ఒకరిపై ప్రశంసలు.. మరొకరిపై విమర్శలు
Jr NTR Viral Video: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా పరంగా మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం.. ఒక హీరో పై ప్రశంసలు కురిపిస్తుండగా..మరో హీరో పై విమర్శలు తెప్పిస్తోంది..
Jr NTR vs Allu Arjun Video: జూనియర్ ఎన్టీఆర్..అల్లు అర్జున్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా పరంగా ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోగా.. పుష్పా సినిమాతో అల్లు అర్జున్ సైతం తగ్గేదేలే అంటూ స్టార్ హీరో అయిపోయాడు. కాగా తెలుగులోనే కాకుండా ఇండియాలోని అన్ని భాషలలోనూ వీరిద్దరికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఈ మధ్య వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు, అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరోపక్క వార్ 2 సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
అయితే ఈ మధ్యనే మే 13 వ తారీఖున తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న వీరిద్దరూ.. తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకొని ఈ ఎలక్షన్స్ లో ఓట్లు వేశాడు
ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ముందు రోజే ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చి.. మే 13 వ తారీకు ఎలక్షన్స్ రోజున ఉదయం ఏడు గంటలకు అంతా పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. చేరుకున్న తరువాత క్యూలో చాలా సేపు నిలబడి మరి ఓటు వేశాడు ఎన్టీఆర్.
ఇక మరో పక్క అల్లు అర్జున్ కూడా ఉదయాన్నే ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్ళారు. అయితే అల్లు అర్జున్ మాత్రం క్యూలో నిలబడలేదు. అక్కడ ఉన్న వారంతా క్యూలో నిలబడి ఓటు వేయడం కోసం ఎదురుచూస్తుండగా.. అల్లు అర్జున్ మాత్రం డైరెక్ట్ గా ఓటింగ్ వేయడానికి రూమ్ లోకి వెళ్ళిపోయాడు
ఈ రెండు వీడియోలను కలిపి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోల పైన ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ స్టార్ ఫామిలీస్ నుంచి వచ్చిన వాళ్లే.. అలానే ఇద్దరికీ స్టార్ స్టేటస్ కూడా ఉంది.. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో అనుకువగా.. ఒక పద్ధతి, డిసిప్లిన్ అనేది పాటిస్తూ ఉంటే.. అల్లు అర్జున్ కి మాత్రం ఎందుకు అంత కొవ్వు అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలి అనేలా జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ని మాత్రం తీరు మార్చుకోవాలి అంటూ విమర్శిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
Also Read: Theatres Closed: థియేటర్లు బంద్.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter