HBD David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా వార్నర్ కు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ రంగ ప్రముఖులు కూడా డేవిడ్ భాయ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వార్నర్ కు విషెస్ చెబుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకానిక్ ‘పుష్ప’ భంగిమలో ఉన్న వార్నర్ ఫోటోను షేర్ చేస్తూ ఆసీసీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా బన్నీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


ప్రస్తుతం వార్నర్ భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో అదరగొడుతున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల‌లో రెండు సెంచరీలు చేసి (332 పరుగులు) అత్యధిక పరుగుల ఆటగాళ్లలో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది. రీసెంట్ గానే బన్నీ పుష్ప సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఇతడి విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లో కూడా ఏర్పాటు చేశారు. 



Also read: Tillu Square: థియేటర్లను బ్లాస్ట్ చేయడానికి రెడీ అయిన సిద్దు.. టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.