అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ రికార్డు..వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు దక్కించుకున్న అర్హ
Arha gets World`s Youngest chess Trainer Award: హీరో అల్లు అర్జున్ (Hero Allu Arjun) స్నేహరెడ్డిల ముద్దుల కూతురు అల్లు అర్హ.. నాలుగున్నరేండ్లకే చెస్‌లో దూసుకెళ్తోంది. అంతేకాదు.. ప్రఖ్యాత నోబుల్ అవార్డు కూడా అల్లు అర్హను వరించింది.
Allu Arjun's daughter Arha gets World's Youngest chess Trainer Award: ఆ వయసు చిన్నారులకు చెస్ బోర్డు అంటే కూడా ఏమిటో పూర్తిగా తెలియదు. కానీ ఆ వయసులోనే ఆ చిన్నారి ఏకంగా శిక్షకురాలైంది. కేవలం తను ఆడటమే కాదు.. పది మందికి చెస్ లో శిక్షణ ఇస్తోంది. హీరో అల్లు అర్జున్ (Hero Allu Arjun) స్నేహరెడ్డిల ముద్దుల కూతురు అల్లు అర్హ.. నాలుగున్నరేండ్లకే చెస్‌లో దూసుకెళ్తోంది. అంతేకాదు.. ప్రఖ్యాత నోబుల్ అవార్డు కూడా అల్లు అర్హను వరించింది.
శేరిలింగంపల్లి నియోజవర్గ పరిధిలోని హైటెక్ సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ చెస్‌లో ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత తను క్రీడలో నేర్చుకున్న అంశాలను వివరించటంతో పాటు తన తోటి స్నేహితులకు, ఇంట్లో పని చేసే వారికి చెస్‌లో (chess) అర్హ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.
Also Read : ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ వార్నింగ్
ఇలా గడిచిన రెండు నెలల్లో అల్లు అర్హ సుమారు 50 మందికి పైగా చెస్‌లో ట్రైనింగ్ ఇచ్చేసింది. అర్హ.. ప్రతిభను శిక్షకుల ద్వారా తెలుసుకున్న ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధి, ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు తాజాగా నైపుణ్య పరీక్షను నిర్వహించారు.
ఇందులో అల్లు అర్హ.. సత్తా చాటింది. అర్హ.. సామర్థ్యాన్ని గుర్తించి.. ఆమెకు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు.. వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు (Worlds Youngest chess Trainer Award) అందించారు. ఈ అవార్డును తాజాగా అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతుల సమక్షంలో అల్లు అర్హకు (Allu Arha) ఆర్బిటర్ బాలాజీ ప్రదానం చేశారు.
Also Read : రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. కేంద్రానికి మూడు డిమాండ్లు..రెండ్రోజుల్లో తేల్చుకోని వస్తాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook