Allu Arha Ganesh Idol: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ(Allu Arha) తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతగా పాపులర్ ఈ చిన్నారి. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా సమంత టైటిల్ రోల్ చేసిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించారు అర్హ. ఈ చిన్నారి మరోసారి తన ప్రతిభను చూపించింది. వినాయక చవితి సందర్భంగా మట్టితో ఓ గణపతి విగ్రహాన్ని తయారు చేసింది. తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా విగ్రహాన్ని తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అర్హ టాలెంటెకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో అల్లు అర్హ చెప్పిన క్యూట్ డైలాగ్స్, డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి. గత నెల రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు అల్లు అయాన్‍కు రాఖీ కట్టారు ఆర్హ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు స్నేహారెడ్డి. ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన గా నటిస్తోంది. ఫహద్ పాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. 



Also Read: Varun-Lavanya wedding: పెళ్లి షాపింగ్‌లో బిజీ బిజీగా వరుణ్‌-లావణ్య, వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook