Pushpa Movie Collects Rs 177 Cr at Worldwide in 42 days: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్‌'. గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. పుష్ప రిలీజ్ అయి దాదాపుగా 50 రోజులు పూర్తికావొస్తున్నా.. ఓటీటీలో విడుదల అయినా కలెక్షన్స్ సునామీ మాత్రం ఆగట్లేదు. బాక్సాఫీస్‌ వద్ద పుష్ప కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమా 42 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 177.16 కోట్ల షేర్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో రూ. 85.35 కోట్ల షేర్లు (రూ. 133.25 కోట్ల గ్రాస్) వసూల్ అయ్యాయి. ఈ 42 రోజుల్లో నైజాంలో రూ 40.74 కోట్లు, సీడెడ్‌లో రూ 15.17 కోట్లు, యూఏలో రూ 8.13 కోట్లు, తూర్పులో రూ 4.89 కోట్లు, పశ్చిమలో రూ 3.95 కోట్లు, గుంటూరులో రూ 5.13 కోట్లు, కృష్ణాలో రూ 4.26 కోట్లు, నెల్లూరులో రూ 3.08 కోట్లు రాబట్టింది. 


కర్ణాటకలో రూ 11.72 కోట్లు, తమిళనాడులో రూ 12.30 కోట్లు, కేరళలో రూ 5.56 కోట్లు, హిందీలో రూ 45.50 కోట్లు, ఆర్‌ఓఐలో రూ. 2.24 కోట్లు
ఓఎస్‌లో రూ 14.55 కోట్లు పుష్ప సినిమా వసూలు చేసింది. మొత్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 177.16 కోట్ల (రూ. 342 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప సినిమా మొదటి రోజు 24.9 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. 


ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. బన్నీని ఊరమాస్‌ యాంగిల్‌ను జనాలకు పరిచయం చేశాడు. చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్‌ తన నటనతో వన్‌ మ్యాన్‌ షో చేశాడు. శ్రీవల్లి పాత్రలో కన్నడ అందం రష్మిక తనదైన శైలిలో నటించారు. సునీల్, అనసూయ కూడా ఆకట్టుకున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. 


Also Read: Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు సోదరుల వినూత్న ఆహ్వానం.. గుండెలు పిండేస్తున్న వీడియో!!


Also Read: Ketika Sharma Pics: ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతిపోగోడుతోన్న కేతిక శర్మ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook