చిత్రం: బడ్డీ
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్, ముఖేష్ ఋషి,  ప్రిషా రాజేశ్ సింగ్, తదితరులు
సినిమాటోగ్రఫీ:కృష్ణన్ వసంత్
ఎడిటర్: రూబెన్
సంగీతం: హిప్ హాప్ తమిళ
బ్యానర్: కింగ్ మేకర్ పిక్చర్స్  
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: సామ్ ఆంటోని


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 11 యేళ్లు అవుతున్న తాను ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఈయన కాస్త వేచి చూసి ‘బడ్డీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఫ్రైడే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..
ఆదిత్య (అల్లు శిరీష్)పైలైట్. తన డ్యూటీలో భాగంగా ఎపుడు ATC తో మాట్లాడుతుంటాడు.ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్) తో మాటలతోనే ప్రేమల పడతాడు. మరోవైపు అంతర్జాతీయంగా అక్రమంగా మనుషులను ఎత్తుకొని పోయి వారి అవయవాలను డబ్బున్న వాళ్లకు అమ్మే ముఠా ఒకటి ఉంటుంది. దానికి డాక్టర్  అర్జున్ కుమార్ నేతృత్వం వహిస్తుంటాడు. కిడ్నాప్ అయ్యేవాళ్ల అవయవాలను తన పెషెంట్స్ కు అమరుస్తుంటాడు.  ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ స్మగ్లర్ కుమారుడికి గుండె మార్పిడి చికిత్స అవసరం ఏర్పడుతుంది. అతని బ్లడ్ గ్రూపు సహా అన్ని పల్లవి తో మ్యాచ్ అవుతాయి. ఈ క్రమంలో హాంగ్ కాంగ్ వేదికగా ఉన్న డాక్టర్ అర్జున్ వర్మ గ్రూపు .. పల్లవిని కిడ్నాప్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. కానీ విచిత్రంగా ఆమె బతికి ఉండగానే ఆత్మ  టెడ్డీ బేర్ లోకి వెళుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ఆత్మ బడ్డీ నుంచి తిరిగి ఆమె శరీరంలోకి తిరిగి వచ్చిందా..?  ఈ క్రమంలో ఆదిత్య బడ్డీకి ఎలంటి సహాయం చేసాడు. చివరకు బడ్డీతో కలిసి ఆదిత్య అక్రమ మానవ అవయవాల రవాణా రాకెట్ గుట్టు రట్టు చేసాడా  అనేదే ‘బడ్డీ’ స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
కొన్ని సినిమాలకు లాజిక్ లను పక్కన పెట్టి చూడాలి. ఒక ఆత్మ బట్టలు మార్చినట్టు ఇతర శరీరంలోకి వెళుతుంటాయని మన పురాణ ఇతిహాసాలు..శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ ఇక్కడ హీరోయిన్ కోమాలో బతికి ఉండగానే ఆమె ఆత్మ టెడ్డీ బేర్ లో ప్రవేశించడం. ఆ తర్వాత  టెడ్డీ బేర్ (బడ్డీ) తన శరీరంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు ఇంకాస్త ఎఫెక్ట్ గా చూపించి ఉండే బాగుండేది.  మరోవైపు ఈ సినిమాలో మానవ అక్రమ రవాణా నేపథ్యంలో వారి అవయవాల వ్యాపారం చేయడం అనే కాన్సెప్ట్ కు జోడించాడు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టు.. కొన్ని హాస్పిటల్స్ వ్యాపారాల కోసం ఎలాంటి దారుణాలకైనా ఒడిగట్టడం సోషల్ ఇష్యూ ను లేవనెత్తడం వంటి అంశాలు బాగున్నాయి. అయితే.. టెడ్డీ అలియాస్ బడ్డీ మాట్లాడిని ఎదుటి వాళ్లు పెద్దగా షాక్ అయ్యే సీన్స్ ఇంకాస్త పెట్టి ఉంటే బాగుండేది. మొత్తంగా ఈ సినిమాలో బడ్డీ చేసే విన్యాసాలు కామన్ ఆడియన్స్ కంటే.. చిన్న పిల్లను ఎంగేజ్ చేసేలా సీన్స్ ఉన్నాయి. హాంగ్ కాంగ్ లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు స్టెప్పులు.. క్లైమాక్స్ లో బడ్డీ చేసే కామెడీ ఫైట్స్ తో పాటు జై బాలయ్య వంటి డైలాగులకు థియేటర్స్ లో విజిల్స్ పడతాయి.


ఇక బడ్డీ కోసం అక్రమ అవయావాల వ్యాపారం చేసే డాక్టర్ తో ఆదిత్య ఎలంటి పోరాటం చేసాడు. హాంగ్ కాంగ్ వెళ్లి ..పల్లివి ఎలా తీసుకొచ్చాడనేది ఇంట్రెస్టింగ్ సాగుతుంది. అక్కడక్కడ లాజిక్ పక్కన పెడితే.. బడ్డీ సినిమాతో ప్రస్తుతం సమాజాంలో జరగుతున్న అక్రమ అవయావాల వ్యాపారాన్ని దర్శకుడు హైలెట్ చేసాడు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళఆర్ఆర్  బాగుంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రీఫీ బాగున్నాయి. దర్శకుడు ఈ సినిమాలో బడ్డీతో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ చేయిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటలర్ తన కత్తెరకు పదను పెడితే బాగుండేది.


నటీనటుల విషయానికొస్తే..


అల్లు శిరీష్ ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతని నటనలో మెచ్చురిటీ కనిపించింది. మరోవైపు పల్లవి పాత్రలో నటించిన గాయత్రి భరద్వాజ్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇంకోవైపు ముఖేష్ ఋషి హీరో బాబాయి పాత్రలో ఒదిగిపోయాడు. ఇంకోవైపు విలన్ నటించిన అజ్మల్ తన పాత్రలో క్రూయాలిటీ పండించాడు. చివరకు తేలిపోయాడు.  అలీ ఉన్న పెద్దగా నవ్వించలేకపోయాడు.


ప్లస్ పాయింట్స్


ఇంటర్వెల్ బ్యాంగ్


బడ్డీ చేసే విన్యాసాలు


అల్లు శిరీష్ యాక్టింగ్


మైనస్ పాయింట్స్


సినిమా నిడివి


లాజిక్ లేని సీన్స్


పంచ్ లైన్.. ‘బడ్డీ’..లాజిక్ ను పక్కన పెడితే ఓ సారి చూడొచ్చు.


రేటింగ్.. 2.75/5


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter