Alluri Sowmya files PIL in Telangana HC against Ram Charan and Jr NTR's RRR movie: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ (NTR), మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోలుగా రూపొందిన చిత్రం  'ఆర్ఆర్ఆర్' (RRR Movie). ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌లు న‌టించారు. మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో మెగా, నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు అడుగడుగా అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా చిత్ర యూనిట్ 4 సార్లు వాయిదా (RRR Postpone) వేసింది. తాజాగా ఈ పాన్ ఇండియా సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య (Alluri Sowmya) అనే మహిళ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అల్లూరి, కొమురం భీమ్ చ‌రిత్ర‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని అల్లూరి వంశస్తులు అయిన సౌమ్య పిల్‌లో పేర్కొన్నారు. 


Also Read: Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు!!


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుద‌ల‌పై స్టే ఇవ్వాల‌ని, సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌కూడ‌ద‌ని  పిటీష‌న‌ర్ అల్లూరి సౌమ్య కోరారు. జ‌స్టిస్ ఉజ్జల్ భూయాన్‌, జ‌స్టిస్ వెంకటేశ్వ‌ర రెడ్డికి చెందిన ధ‌ర్మాసనం ఈ పిల్‌పై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ప్రజాహిత వ్యాజ్యం కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. అయితే ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఎప్పటి నుంచో ఈ సినిమా కల్పిత కథ మాత్రమేనని, వారి నిజం జీవితంతో దీనికి ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. 


చ‌రిత్ర‌లో ఎన్నడూ కలుసుకోని ఇద్ద‌రు యోధులను కలిపి ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రూపొందించారు. ఇద్ద‌రు యోధులు కొమురం భీమ్‌ (Komaram Bheem), అల్లూరి సీతా రామ‌రాజు (Alluri Sita Ramaraju) స్నేహం చేసి.. గొడ‌వ‌లు ప‌డ్డ‌ప్పుడు వారి ఆలోచ‌న‌లు దేశ స్వాతంత్య్రం కోసం ఎలా సాయం చేశాయనే ఫిక్ష‌న‌ల్ కథాంశంతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రూపొందింది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి బాలీవుడ్‌, హలీవుడ్ స్టార్స్ ఇందులో నటించారు. 


Also Read: India Corona Cases Today: దేశంలో కరోనా విలయం.. లక్షకు చేరువైన కొవిడ్ కేసులు- 325 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.