Amala Akkineni : కుక్కల లెక్కలు చెప్పిన అమల అక్కినేని.. కనీపం ఆ పిల్లాడి పేరు కూడా ఎత్తని నాగ్ భార్య
Amala Akkineni on Dog Attack అమల అక్కినేని తాజాగా హైద్రాబాద్‌లోని కుక్కల లెక్కలు చెప్పింది. ఎన్ని కుక్కలు జనాభా నియంత్రణ ఆపరేషన్ చేశారో.. ఎన్ని కుక్కలకు వాక్సిన్ వేశారో చెప్పుకొచ్చింది. అయితే కుక్కల దాడిలో చనిపోయిన ప్రదీప్ పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు.
Amala Akkineni on Dog Attack అంబర్ పేట్ కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కుక్కలు దాడి చేసిన ఘటన, ఆ బాలుడి వ్యథను చూసి అంతా చలించిపోయారు. అలా పీక్కుతింటూ ఉన్న విజువల్స్ చూసి అంతా కదిలిపోయారు. కానీ కొంత మంది జంతు ప్రేమికులు మాత్రం కుక్కలపై జాలి చూపించారు. చనిపోయిన బాలుడి గురించి గానీ ఆ కుటుంబం గురించి కానీ కించిత్ బాధను కూడా వ్యక్తం చేయడం లేదు.
రష్మీ లాంటి జంతు ప్రేమికులు కుక్కల పట్ల ఎంత ప్రేమను కనబరుస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సమాజంలో కుక్కలకు కూడా బతికే స్వేచ్చ ఉందని, ఈ ప్రపంచం ఏమీ ఒక్క మానవ జాతిదే కాదని, కుక్కల వల్లే కాదు.. మేకలు, ఆవుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇలా మాట్లాడుతూ రావడం, ఆమె మీద జనాలు తిట్లతో దాడి చేయడం, చంపేస్తాం, యాసిడ్ పోస్తాం, చేతబడి చేయిస్తాం అంటూ ఇలా బెదిరింపులు రావడం గత వారం నుంచి చూస్తూనే ఉన్నాం.
తాజాగా కుక్కలపై సమాజంలో జరుగుతున్న చర్చలు, జీహెచ్‌ఎంసీకి కుక్కల బెడద మీద వస్తోన్న ఫిర్యాదుల మీద అమల అక్కినేని స్పందించినట్టుంది. పెటా, బ్లూ క్రాస్, జీహెచ్‌ఎంసీలు ఇన్నేళ్లలో చేసిన పనుల గురించి అమల చెప్పుకొచ్చింది. గత ముప్పై ఏళ్లుగా ఈ సంస్థ దాదాపు ఐదున్నర లక్షల జంతువులకు సాయం అందించింది. అందులో దాదాపు 1.32లక్షల కుక్కలకు జనాభా నియంత్రణ ఆపరేషన్ చేశాం. రెండు లక్షల కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేశాం. వీటి నుంచి ఏ ఒక్క మనిషికి కూడా హాని జరగలేదు. నేను ఆ విషయంలో మీకు మాటిస్తున్నాను. ఈ ముప్పై ఏళ్లలో మేం చేసిన పని వల్ల ఏడు లక్షల వీధి కుక్కలు తగ్గాయి.
ఒక ఘటన జరిగిందని, మనిషికి జంతువులకు యాభై వేల ఏళ్ల నుంచి ఉన్న బంధాన్ని తెంపుకోగలమా? అలాంటి కుక్కల దాడి ఘటన అనేది అరుదుగా జరుగుతుంది. అయినా అది బాధాకరమైన విషయమే. ఇలాంటివి మళ్లీ ఇంకెప్పుడూ జరగకూడదు. ప్రతీ బిడ్డకు సురక్షితంగా బతికే హక్కు ఉంది. జీహెచ్ఎంసీ, జంతు సంరక్షణ సంస్థలన్నీ కలిసి కుక్కలకు స్టెరిలైజ్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.. వాటికి రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం. ఇక అవన్నీ కామ్ అండ్ సేఫ్‌గా ఉంటాయి.
ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకి సైతం ఇలానే చేయండి. ఈ సమాచారం అందరికీ చేరాలి. స్టెరిలైజ్డ్ చేయని కుక్కలుంటే కచ్చితంగా ప్రమాదకరమే అంటూ హెల్ప్ లైన్ నంబర్లు, జీహెచ్ ఎంసీ యాప్ గురించి అమల చెప్పుకొచ్చింది. కానీ ఎక్కడా కూడా ఈ పోస్ట్‌లో చనిపోయిన ప్రదీప్ గురించి అమల స్పందించలేదు. పేరు కూడా ఎత్తలేదు.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook