Amala Paul cheating complaint against Bhavninder Singh Dhatt: హీరోయిన్ అమలా పాల్ గురించి ఒక షాకింగ్ విషయం తెర మీదకు వచ్చింది. తన మాజీ ప్రియుడు భవినీందర్ సింగ్ తనను మోసం చేశాడని, లైంగికంగా వేధించి, బెదిరించాడని విల్లుపురం జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమలా పాల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విభేదాల కారణంగా విడిపోయిన క్రమంలో తనను భవినీందర్ సింగ్ వేధించారని అమలా పాల్ ఆరోపించింది. హీరోయిన్ గా పలు సినిమాలతో అలరించిన ఆమె కడవర్ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె నిర్మించిన ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. 2018లో చెందిన అమలా పాల్ , పంజాబ్‌కు భవినీందర్ సింగ్ దత్ స్నేహితులు అయ్యారు. తదనంతరం, అమలా పాల్ భవినీందర్ సింగ్ దత్ వారి కుటుంబం మరియు స్నేహితులతో పుదువైలోని కోటకుప్పం సమీపంలోని పెరియ ముదలియార్‌సవాడిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఒక సినిమా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమలా పాల్, భవినీందర్ మధ్య పెరిగిన సాన్నిహిత్యం కారణంగా తాను అమలను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడట.


ఆ తర్వాత కొన్ని విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు. అయితే సదరు నిర్మాణ సంస్థలో అమలా పాల్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ నిర్మాణ సంస్థలోనే అమలా పాల్ తాజా మూవీ కడవర్ నిర్మించింది. ఇక తాజాగా దత్ కంపెనీ డైరెక్టర్‌గా అమలా పాల్‌ను తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని పోలీసులు తెలిపారు. వారి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అమలా పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు దత్‌పై ఫోర్జరీ, బెదిరింపు, వేధింపులతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.


అంతేకాక  అమలా పాల్ విల్లుపురం జిల్లా ఆరోవిల్ సమీపంలో తన సొంత ఇంట్లో ఉంటున్నప్పుడు , కొందరు వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించారని, దత్ తో కలిసి ఉన్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయిన తర్వాత కూడా భవినీందర్ తనను వేధించాడని అమలా పాల్ పేర్కొంది. 2020లో, నటి అమలా పాల్ ముంబైకి చెందిన గాయకుడు భావిందర్ సింగ్‌తో రిలేషన్ ఉన్నారని, అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందని కూడా వార్తలు తెర మీదకు వచ్చాయి.


ఈ విషయాన్ని ధృవీకరించకుండానే వారి బంధానికి బ్రేకులు పడ్డాయి. ఆ సమయంలో అమలా పాల్ తన మాజీ ప్రియుడు భవినీందర్ సింగ్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఆ ఫోటోలలో ఇద్దరూ వివాహం చేసుకున్నట్టు కనిపించారు. ఆ ఫోటోలు ప్రొఫెషనల్ వర్క్ కోసం తీశారని, అయితే వాటిని దుర్వినియోగం చేశారని అమలా పాల్ ఆరోపించింది.


ఇప్పుడు అమలా పాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు, భవినీందర్ సింగ్‌తో ఉన్న తన ఫోటోలు ప్రచురించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు శీర్షికతో ఆ ఫోటోలు షేర్ చేసినందుకు ఆమె భవినీందర్ సింగ్‌పై పరువు నష్టం దావా కూడా వేసింది. గతంలో 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లాడిన అమలా పాల్, 2017లో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.  
Also Read: Singer Vaishali Bulsara Murder: ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కారులో అలాంటి స్థితిలో డెడ్ బాడీ


Also Read: Anasuya Aunty Controversy: పాపం అనసూయకు వరుస కష్టాలు.. ఆంటీ వివాదంతో మూడు అవకాశాలు గాయబ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి