Amala Paul Made Degrading Comments on Tollywood: తెలుగు సినీ పరిశ్రమపై హీరోయిన్ అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన ఈ మలయాళ భామ బెజవాడ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగులో స్థిరపడింది. కానీ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయింది. దీంతో తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కూడా పలు సినిమాల్లో నటిస్తూ తమిళ దర్శకుడు విజయ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె ప్రేమ వివాహం కూడా ఎక్కువ రోజులు సఖ్యతతో సాగలేదు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో తన మాజీ ప్రియుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతని అరెస్ట్ చేయించిన ఈ భామ తెలుగు సినీ పరిశ్రమపై తన అక్కసు వెళ్లగక్కిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  తాను గతంలో తెలుగు సినీ పరిశ్రమలో ఉండగా అనేక సినీ ఆఫర్లు తనకు వచ్చేవని అయితే తను వాటిని దూరం చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.


ఎందుకు అంటే తెలుగు సినీ పరిశ్రమ గ్లామర్ సినీ పరిశ్రమని, ఈ సినీ పరిశ్రమ కేవలం కొన్ని కుటుంబాల చేతిలో ఉంటుందని వారి ప్రభావం సినిమాల మీద ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. వారి ప్రభావంతో దాదాపు సినిమాలు అన్నీ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటాయని ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు కొన్ని లవ్ సీన్లు ఇలా సినిమా మొత్తం గ్లామర్ కోణంలోనే సాగుతుంది తప్ప కధకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరని ఆమె అభిప్రాయపడింది.


ఇక తనకు సినీ పరిశ్రమలో ఆఫర్లు రావడం లేదని జరిగే ప్రచారం నిజం కాదని తనకు వచ్చిన ఆఫర్లను కూడా తాను కావాలని దూరం చేసుకున్నామని ఆమె చెప్పుకొచ్చింది. సుమారు తన వయసు 17 గా ఉన్నప్పుడు తాను సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చానని ఇప్పుడు తన వయసు 30 సంవత్సరాలలని, 13 ఏళ్లపాటు ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాలలో నటించిన నేను ఇక మీదట బ్రేక్ అవసరమని భావించి బ్రేక్ తీసుకున్నానని అమలాపాల్ చెప్పకొచ్చారు.


అయితే అమలాపాల్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన కామెంట్లు కొందరు నిజమే కదా అని అంటుంటే మరికొందరు మాత్రం ఆమెకు సినీ అవకాశాలు రాక ఇలా తన అక్కస్సు వెళ్లగకుతుందని కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆమె చేసిన కామెంట్లు చాలా మంది చిన్న నిర్మాతలు ఆడపాదడపా చేస్తూనే ఉంటారు. సినీ పరిశ్రమ నలుగురు పెద్ద నిర్మాతల చేతిలోనే ఉందని కొన్ని కుటుంబాలు సినీ పరిశ్రమను శాసిస్తున్నాయని అనేక సమయాల్లో వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Esther Anil Hot Photos: దృశ్యం పాప దిమ్మతిరిగే హాట్ ట్రీట్.. నెవర్ బిఫోర్ అనేలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి