Naga Chaitanya and Samantha:
విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల దగ్గర నుంచి ఇప్పుడే షూటింగ్ మొదలుపెట్టిన సినిమాల వరకు.. ఎన్నో సినిమా ఓటీటీ డీల్స్ ని తన సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్. 2024 లో అమెజాన్ ప్రైమ్ హవా కొనసాగనుంది అని నిన్న జరిగిన ఈవెంట్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసిన సినిమాలు వెబ్ సిరీస్ లిస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 19న అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక మెగా ఈవెంట్ నిర్వహించింది. ఈ వేదికపై తమ ప్లాన్ గురించి చెబుతూ రానున్న రోజుల్లో విడుదల చేస్తున్న 70 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోల వివరాలను ప్రకటించింది. ఈవెంట్‌లో అమెజాన్‌కు చెందిన ఇండియన్, గ్లోబల్ టీమ్ లీడర్ షిప్ సభ్యులు పాల్గొన్నారు. తమ సంస్థ చేపట్టబోయే ప్రణాళికలను మీడియా ముందుంచారు.


ముఖ్యంగా ప్రైమ్ వీడియో నిన్న ప్రకటించిన తెలుగు సినిమాలలో ప్ర‌క‌టించిన వాటిల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు  ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, రామ్ చ‌ర‌ణ్‌ గేమ్ చేంజ‌ర్, సూర్య కంగువ, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్, నితిన్ త‌మ్ముడు, రిషబ్ శెట్టి కాంతారా, అనుష్క శెట్టి గాటి , శ్రీవిష్ణు ఓమ్ భీం భుష్ ,సుహాస్, కీర్తి సురేష్ ఉప్పుక‌ప్పురంబు వంటి సినిమాల ప్రకటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే స‌మంత‌ల సిటాడెల్, ఫ్యామిలీమెన్ 3, మిర్జాపూర్ 3, వ‌రుణ్ దావ‌ణ్‌, నాగ చైత‌న్య ధూత‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌ సుజ‌ల్, పాతాల్ లోక్  సీజ‌న్ 2,సంచాయ‌త్ సీజ‌న్ 3, బందీస్ బండిట్స్ , సివ‌రాప‌ల్లి  వంటి అమెజాన్ ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి.


ఇక ఎన్నో బాలీవుడ్ సినిమాలని కూడా త్వరలో తమ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు అమెజాన్ ప్రైమ్.


మరో విశేషం ఏమిటి అంటే ముంబైలోని అమెజాన్ మెగా ఈవెంట్‌లో సమంత రుత్ ప్రభు తాను నటించిన సిటాడెల్ ప్రమోట్ చెయ్యగా మరోపక్క నాగచైతన్య.. తను నటించిన దూత 2 వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఈవెంట్‌లో దిల్ రాజు, మృణాల్ థాకూర్ కూడా పాల్గొన్నారు.


Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌


Also Read: Fishing Ban: 'ఉప్పెన' సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ "పని" నిషేధం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter