HBD Amitabh Bachchan : కూలీలో ప్రమాదం.. కేబీసీతో ఊపిరి.. అమితాబ్ ఇన్స్పైరింగ్ స్టోరీ
HBD Amitabh Bachchan బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో అమితాబ్ పేరిట సపరేట్ అధ్యాయమే ఉంటుంది. అంతటి స్థాయిని అమితాబ్ సంపాదించుకున్నాడు.
HBD Amitabh Bachchan : తెలుగు తెరపై అమితాబ్ కనిపించింది చాలా అరుదు. అయినా కూడా అమితాబ్ బచ్చన్ అంటే తెలియని ఇండియన్ ఉండదు. ఏ తరానికి చెందిన వ్యక్తి అయినా సరే.. అమితాబ్ పేరు వినని, సినిమా చూడని వ్యక్తి ఉండడు. గత ఐదారు దశాబ్దాలుగా ఇండియన్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. అయితే మధ్యలో అమితాబ్ చాలా డౌన్ ఫాల్ అయ్యాడు. అప్పుడు వెండితెరను వదిలేసి.. బుల్లితెర మీద దృష్టి పెట్టాడు. అలా కేబీసీ అంటూ జనాల్లో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. అలాంటి అమితాబ్ నేడు 80వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
అమితాబ్ సినీ కెరీర్, పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీలు, పెళ్లి ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింట్‌గానే ఉంటాయి. సినిమాల్లోకి రావడం, నిలదొక్కుకోవడం అమితాబ్‌కు అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయన ఆహార్యాన్ని, ఎత్తుని, గొంతుని అందరూ హేళన చేసేవారు. అయినా పట్టుదలతో బాలీవుడ్‌కు పెద్ద దిక్కులా మారిపోయాడు. ఎన్నెన్నో క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ హిట్లలో నటించాడు. అయితే అమితాబ్.. తాను చేసే సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు.
అలా ఓ సారి కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డాడు. మళ్లీ ఇంటికి తిరిగి వస్తాడా? లేదా అని అందరూ అనుకున్నారు. కానీ అమితామ్ మొండి పట్టుదలే ఆయన్ను బతికించింది. అలా సినిమా షూటింగ్‌లో జరిగే ప్రమాదాలను అమితాబ్ ఎప్పుడూ ఖాతరు చేయలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లవ్ స్టోరీలు, రేఖతో ప్రేమాయణం కూడా అందరికీ తెలిసిందే. రేఖతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అమితాబ్.. చివరకు జయను చేసుకున్నాడు.
సిల్వర్ స్క్రీన్ మీద అమితాబ్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆ టైంలో అమితాబ్ చాలా కింది స్థాయిలోకి వెళ్లిపోయాడు. అప్పుడే అమితాబ్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. కౌన్ బనేగా కరోడ్ పతి అంటూ షోను రన్ చేశాడు.అది విపరీతంగా క్లిక్ అయింది. అలా ఇప్పటికీ పద్నాలుగు సీజన్లు అవుతోంది. అయినా దాని క్రేజ్ తగ్గలేదు. హోస్ట్‌గా అమితాబ్ మారలేదు.
వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. మన తెలుగు హీరోల్లో చిరంజీవి, నాగార్జున వంటి వారిపై అమితాబ్ మక్కువ చూపిస్తుంటాడు. అందుకే నాగార్జున మనం, చిరంజీవి సైరా సినిమాల్లో అమితాబ్ నటించాడు. అలాంటి అమితాబ్ మరిన్ని చిత్రాలతో ఇండియన్ ప్రేక్షకులను అలరిస్తుండాలని కోరుకుంటూ.. జీ తెలుగు న్యూస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
Also Read : Ram Charan Trujet : దివాలతీసిన రామ్ చరణ్ కంపెనీ
Also Read : Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!.. సమంత ఉద్దేశ్యం ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook