తమిళ తళైవా రాజకీయరంగ ప్రవేశం తమిళనాడులోని రజినీకాంత్ అభిమానులకే కాదు... అతడి ఆప్తమిత్రుడైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి సైతం అమితమైన ఆనందాన్ని కలిగించినట్టుంది! అందుకే కాబోలు.. "నా ఆత్మీయమిత్రుడు, మానవతావాది సూపర్ స్టార్ రజినీకాంత్‌కి రాజకీయాల్లో అంతా శుభమే కలగాలని కోరుకుంటున్నాను'' అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్ ఎంట్రీ స్థానికంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళ తంబీలు సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశాన్ని వేడుకలా జరుపుకుంటుండగా మరోవైపు ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని నిశితంగా పరిశీలిస్తున్నాయి.