బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేయనున్న కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం 10వ సీజన్‌కి సర్వం సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ కోసం హాట్ సీట్ వేచిచూస్తుండగా, ఆ సీటులో అమితాబ్ ఎప్పుడు కూర్చుంటారా ? కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం మళ్లీ ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుగా బిగ్ బీ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం 10వ సీజన్‌కి సంబంధించిన ప్రోమో సైతం విడుదలైంది. ఈ ప్రోమోతోపాటు ఈ షోలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ సంబంధిత లింకుని ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంది షోను ప్రసారం చేయనున్న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఛానెల్. కౌన్ బనేగా కరోడ్‌పతి రిజిస్ట్రేషన్స్ జూన్ 6వ తేదీ రాత్రి 8:30 నుంచి ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రారంభం కాగా ఈ ఏడాది జరగనున్న సీజన్ 10వది. అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేయడం ఇది 9వ సారి కాగా మధ్యలో ఒక ఏడాది కింగ్ ఖాన్ షారుఖ్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.